`ఫిదా`, `ఎంసీఏ` చిత్రాలతో తెలుగునాట రెండు వరుస విజయాలను అందుకున్న కథానాయిక సాయిపల్లవి. అయితే… గత ఏడాది విడుదలైన `కణం`, `పడి పడి లేచె మనసు` సినిమాలు ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఆశించిన స్థాయి ఫలితాలను అందివ్వలేకపోయాయి. అయినప్పటికీ… ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా నటించే ఛాన్స్ సాయిపల్లవిని వరించిందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో అనిల్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రం జూన్ లేదా జూలై నుంచి పట్టాలెక్కనుందని సమాచారం. కాగా… ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు స్థానముండగా అందులో ఒకరిగా డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని… త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రావచ్చని టాక్. టాలీవుడ్లో ఇప్పటివరకు స్టార్ హీరోలతో నటించని సాయిపల్లవికి ఇది `సూపర్`ఛాన్సే. మరి… ఈ కాంబినేషన్ వార్తలకే పరిమితమవుతుందో లేదంటే కార్యరూపం దాల్చుతుందో చూడాలి.
[youtube_video videoid=09CDzuJbjeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: