..ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్… ఇలా రెండు చోట్లా బెస్ట్ కపుల్ అనిపించుకున్న జంట అక్కినేని నాగచైతన్య, సమంత. `ఏమాయ చేసావె`, `మనం`, `ఆటోనగర్ సూర్య` చిత్రాల్లో జోడీగా నటించిన చైతూ, సామ్… ఐదేళ్ళ తరువాత కలసి నటిస్తున్న చిత్రం `మజిలీ`. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 5న సెల్యులాయిడ్ పైకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`మనం` తరువాత దంపతుల పాత్రల్లో చైతూ, సామ్ నటిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అంతేకాదు… ఐదేళ్ళ క్రితం విడుదలైన `మనం` కూడా సమ్మర్ సీజన్‌లో రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన నేపథ్యంలో… `మజిలీ` కూడా వేసవికే విడుదలకు సిద్ధమవుతుండడం సినిమా ఫలితంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి… ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న `మజిలీ`… `మనం`లాగే వేసవి సాక్షిగా మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
[youtube_video videoid=jNZPdlUP7cc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: