తన లుక్స్ తో, యాక్టింగ్ స్కిల్స్ తో అటు బాలీవుడ్ లోనే కాదు.. ఇటు తెలుగు, తమిళ్ లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది కియారా అద్వాని. ప్రస్తుతం తాను సందీప్ వంగా డైరెక్షన్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలసిందే. వాటితో పాటు కరణ జోహర్ సినిమాలోనూ.. అదేవిధంగా అక్షయ్ కుమార్ తో గుడ్ న్యూస్ అనే మరో సినిమాలోనూ నటించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా..ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ కియారాకు దక్కినట్టు తెలుస్తోంది. లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన హార్రర్ సినిమా కాంచన ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి లారెన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతోనే ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఆసక్తి కరమైన విషయం ఏంటంటే… గుడ్ న్యూస్ లో నటిస్తున్న అక్షయ్ కుమార్, కియారా అద్వానీనే ఈ సినిమాలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం.. ఈ వార్తల్లో ఎంత నిజముందో..!
[youtube_video videoid=EPhHbH7FR74]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: