నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమా తరువాత ఈ పదినెలల టైంలో ఏ ఒక్క సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో టాప్ డైరెక్టర్లే ఉన్నారనుకోండి. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంది. అయితే ఎప్పుడో పట్టాలెక్కాల్సింది కానీ ఇంకా జరగలేదు. ఇక ఎవరూ ఊహించని విధంగా.. అందరికీ షాకిస్తూ.. శివరాత్రి రోజున సుకుమార్ తో మరో కొత్త ప్రాజెక్ట్ ఉన్నట్టు ప్రకటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి సుకుమార్ తో మహేష్ సినిమా అని గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. కానీ అది క్యాన్సిల్ అయింది. దీంతో సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ కోసం ఎంతో మంది హీరోలు వెయిట్ చేస్తుంటారు. అందుకే బన్నీ ముందు చూపుతో సుక్కు ను కూడా బుక్ చేసేశాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమాను ప్రారంభించనున్నారట.
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ కొత్త సినిమా ఉండబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ మురగదాస్ సినిమాకు కూడా అల్లు అర్జున్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారికి ప్రకటన ఇవ్వనున్నారట. ఒకవేళ ఓకే అయితే మరి ఆ రెండు సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి.. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో..
మొత్తానికి అల్లు అర్జున్ ఈ లాంగ్ గ్యాప్ ను బాగానే ఫుల్ ఫిల్ చేసేలా ఉన్నాడు. ముందు జాగ్రత్తగా వరుసపెట్టి అందరు స్టార్ డైరెక్టర్స్ ను బుక్ చేసి మరీ పెట్టుకుంటున్నాడు. సెట్స్ పైకి వెళ్లడం తరువాత సంగతి… ముందు స్టార్ డైరెక్టర్స్ ను చేతిలో పెట్టుకుంటే ఎక్కడికీ వెళ్లరన్న స్ట్రాటజీని బన్నీ బాగా వాడినట్టు ఉన్నాడు. మరి చూద్దాం ఈసినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో.. ?ఎప్పుడు రిలీజ్ అవుతాయో..? చూద్దాం..
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: