ఇద్దరు హీరోలతో భారీ షెడ్యూల్ ప్లాన్

JR NTR and Ram Charan in RRR Heavy Schedule,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RRR Movie Shooting Updates,RRR Telugu Movie Latest News,JR NTR and Ram Charan New Movie RRR,RRR Movie New Shooting Schedule Details,RRR Movie New Shooting Plans
JR NTR and Ram Charan in RRR Heavy Schedule

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ తో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీ కరిస్తున్నారు రాజమౌళి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక పీరియడ్‌ డ్రామాగా, బ్రిటిష్‌ కాలం నేపథ్యంతో సినిమా రూపొందిస్తున్నారని.. ఈ సినిమాలో చెర్రీ త్రీ షేడ్స్ లో కనిపిస్తున్నారంటూ.. ఎన్టీఆర్ పాత్ర రెండు వైవిధ్యమైన షేడ్స్‌ను కలిగి ఉంటుందని ఇలా ఈ సినిమాపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ అవి వస్తూనే ఉంటాయి. వాటిని ఆపడం కష్టమనుకోండి.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం మరో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కోల్ కతాలో 40 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ను జరపనున్నారట. అయితే ఇప్పటి వరకూ చెర్రీతో షూటింగ్ జరగగా.. ఇప్పుడు ఈ షెడ్యూల్ లో స్టార్ హీరోలు ఇద్దరూ పాల్గొంటారట. ఈ షెడ్యూల్ లో వీరిద్దరి మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారట.

కాగా దాదాపు 300 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ భారీ బ‌డ్జెట్ సినిమాకు డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లను మాత్రం ఇంకా సెలక్ట్ చేయలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

[subscribe]

[youtube_video videoid=-fIckspYhns]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =