
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 97


తమిళ్ హార్రర్ మూవీ రీమేక్ లో!

దిల్ రాజు ఖాతాలో మరో సక్సెస్

118 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

సర్వం తాళమయం తెలుగు ట్రైలర్ రిలీజ్

`96` రీమేక్‌కి టైటిల్ కుదిరిందా?

బన్నీ... ఇద్దరితోనూ మూడోసారి

`పంతం` దర్శకుడితో నిఖిల్ సినిమా?

మహేష్‌కి జోడీగా సాయిపల్లవి?

టీజర్ కు మెగా ప్రశంస

118 విషయంలో తారక్ చెప్పిందే నిజమైంది

`వెంకీమామ`లో రాశి సందడి మొదలైంది

షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ 2 రిలీజ్

హిట్ కాంబినేషన్స్ తో మూవీ

సందీప్ కిషన్ కొత్త సినిమా అప్ డేట్

50 డేస్ పూర్తి చేసుకున్న ఎఫ్2

షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 రిలీజ్ టైమ్ ఫిక్స్

ఎన్నెన్నో ప్రత్యేకతల ప్రతిష్టాత్మక సాహసం సాహో
కొన్ని సినిమాలు ప్రారంభించినప్పటి పరిస్థితులకు, ప్రారంభించాక ఎదురయ్యే పరిణామాలకు పొంతనే ఉండదు. ఒక మోస్తరు బడ్జెట్ తో , మీడియం రేంజ్ సినిమాగా ప్రారంభమై అనూహ్యంగా మల్టీ క్రోర్స్ భారీ చిత్రంగా షేప్ తీసుకుంటాయి కొన్ని చిత్రాలు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేసిన బాహుబలి వన్ అండ్ టు , ఇప్పుడు తాజాగా చేస్తున్న "సాహో" చిత్రాల ప్రారంభ అంచనాలకు తరువాత పెరిగిన "నిర్మాణ పరిమాణా"లకు సంబంధమే లేదు. ప్రాంతీయ భాషా చిత్రాలుగా ప్రారంభమై ఇండియన్ ఫిలిం ట్రేడ్ మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యే భారీ ప్రాజెక్ట్స్ గా టర్న్ అయ్యాయి బాహుబలి సిరీస్ అండ్ సాహో చిత్రాలు.

తమిళ్ హార్రర్ మూవీ రీమేక్ లో!
తన లుక్స్ తో, యాక్టింగ్ స్కిల్స్ తో అటు బాలీవుడ్ లోనే కాదు.. ఇటు తెలుగు, తమిళ్ లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది కియారా అద్వాని. ప్రస్తుతం తాను సందీప్ వంగా డైరెక్షన్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలసిందే. వాటితో పాటు కరణ జోహర్ సినిమాలోనూ.. అదేవిధంగా అక్షయ్ కుమార్ తో గుడ్ న్యూస్ అనే మరో సినిమాలోనూ నటించనుంది.

దిల్ రాజు ఖాతాలో మరో సక్సెస్
మరోసారి దిల్ రాజు లెక్క తప్పలేదుగా. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు... డిస్ట్రిబ్యూటర్ గా కూడా తాను ఎన్నో సక్సెస్ లు అందుకున్నాడు. ఒక సినిమాను చూసి.. ఆసినిమాలో ఎంత మ్యాటరుంది... సినిమాను కొనచ్చా? లేదా? అనే క్యాలిక్యులేషన్స్ వేయడంలో ఆయనకు ఆయనే సాటి. పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాల విషయంలో కూడా పక్కా కాలుక్యులేషన్ తో వుంటారు దిల్ రాజు. చిన్న సినిమాలైనా సరే కంటెంట్ ఉంటే తప్పకుండా ఆయన ప్రోత్సాహం అందిస్తారు. ఇన్నేళ్లలో ఆయన కొన్న.. నిర్మించిన సినిమాల్లో... కొన్ని సినిమాల విషయంలో ఆయన లెక్కలు…

118 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ '118'. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా..ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబడుతుంది. మరి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

సర్వం తాళమయం తెలుగు ట్రైలర్ రిలీజ్
అటు మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు జీవి ప్రకాష్ కుమార్. తాను హీరోగా సంగీత నేపథ్యంలో తెరకెక్కిన కొత్త సినిమా సర్వం తాళమయం. రాజీవ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది వంటి క్లాసిక్ మూవీస్ ను అందించిన రాజీవ్ మీనన్.. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు.

`96` రీమేక్‌కి టైటిల్ కుదిరిందా?
`96`... గత ఏడాది తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రం. `ప్రేమ`ను `ప్రేమ`గా ప్రేమించేవాళ్ళంతా అందించిన విజయంగా... ఈ సినిమా ఫలితాన్ని వర్ణించారు సినీ విశ్లేషకులు. అలాంటి `96` ఇప్పుడు తెలుగు పలుకులతో అచ్చ తెలుగు వాతావరణంతో మరోసారి తెర రూపం దాల్చనుంది. తమిళ వెర్షన్ రూపకర్త సి.ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్‌ని కూడా రూపొందించనుండగా... ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నాడు. విజయ్ సేతుపతి, త్రిష పాత్రల్లో శర్వానంద్, సమంత దర్శనమివ్వనున్నారు. త్వరలోనే ఈ రీమేక్ వెర్షన్ పట్టాలెక్కనుంది.

బన్నీ... ఇద్దరితోనూ మూడోసారి
గత ఏడాది వేసవికి `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`తో పలకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి... ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందివ్వకపోయినా నటుడిగా మాత్రం ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. కాగా... భారీ విరామం తరువాత ఈ టాలెంటెడ్ హీరో... తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నాడు. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం... ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్. అంతేకాదు... ఈ సినిమా చిత్రీకరణకు వెళ్ళకముందే... మరో ప్రాజెక్ట్‌కి కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఈ చిత్రం…

`పంతం` దర్శకుడితో నిఖిల్ సినిమా?
గత ఏడాది మార్చికి `కిరాక్ పార్టీ`తో పలకరించి అలరించిన యువ కథానాయకుడు నిఖిల్... ఈ సంవత్సరం మార్చికి `అర్జున్ సురవరం`తో సందడి చేయనున్నాడు. తమిళ హిట్ చిత్రం `గణితన్`కి రీమేక్‌గా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్... ఈ నెల 29న సెల్యులాయిడ్ పైకి రానుంది. మహాశివరాత్రి సందర్భంగా నిన్న(సోమవారం) విడుదల చేసిన టీజర్... సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా... ఈ చిత్రం తరువాత కిషన్ దర్శకత్వంలో `శ్వాస` అనే ఇంట్రెస్టింగ్ మూవీని చేయనున్నాడు నిఖిల్. తాజాగా `118`లో ఆద్యగా అలరించిన టాలెంటెడ్ బ్యూటీ నివేదా థామస్ ఇందులో నాయికగా నటిస్తోంది.

అనిల్ రావిపూడి ఆ సీజన్‌నే టార్గెట్ చేసుకుంటున్నాడా?
అనిల్ రావిపూడి... ప్రస్తుతం తెలుగునాట ఈ పేరే ఓ సంచలనం. చిత్ర చిత్ర ప్రవర్ధనమానంగా ఎదుగుతున్నాడీ యువ దర్శకుడు. `పటాస్`తో మొదలైన అనిల్ దర్శకప్రస్థానం... `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`... ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్... తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందించనున్న సంగతి తెలిసిందే. జూన్ లేదా జూలైలో పట్టాలెక్కనున్న ఈ మూవీ... సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం.

మహేష్‌కి జోడీగా సాయిపల్లవి?
`ఫిదా`, `ఎంసీఏ` చిత్రాలతో తెలుగునాట రెండు వరుస విజయాలను అందుకున్న కథానాయిక సాయిపల్లవి. అయితే... గత ఏడాది విడుదలైన `కణం`, `పడి పడి లేచె మనసు` సినిమాలు ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఆశించిన స్థాయి ఫలితాలను అందివ్వలేకపోయాయి. అయినప్పటికీ... ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ సాయిపల్లవిని వరించిందని టాలీవుడ్ టాక్.

టీజర్ కు మెగా ప్రశంస
బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ LLP &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై టి ఎన్.సంతోష్ దర్శకత్వం లో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా జర్నలిజం నేపధ్యం లో రూపొందిన అర్జున్ సురవరం మూవీ మార్చి 29 వ తేదీ రిలీజ్ కానుంది. కనిదన్ తమిళ మూవీ తెలుగు రీమేక్ అర్జున్ సురవరం మూవీ లో నిఖిల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా మొదటిసారి నటిస్తున్నారు.

శివ నామ శివ రూపాలలో చిరంజీవి
తన విలువ ఏమిటో తెలుసుకునేలోపే కరిగిపోయే మంచుగడ్డ లాంటిది కాలం. అలా కరిగిపోయే కాల ప్రవాహంలో కరిగిపోని చెరిగిపోని జ్ఞాపకాల నిక్షిప్త నిధులు ఎన్నో ఎన్నెన్నో... పైన కనిపిస్తున్న ఆర్ట్ వర్క్ లో శివుడి గెటప్ లో కనిపిస్తున్న చిరంజీవి ముఖచిత్రాన్ని చూస్తుంటే అలనాటి మధురానుభూతులు జ్ఞాపకాల కళ్ళముందు సాక్షాత్కరిస్తున్నాయి.

118 విషయంలో తారక్ చెప్పిందే నిజమైంది
పటాస్ సినిమా తరువాత సరైస సక్సెస్ కోసం వేయి కళ్లతో చూసిన ఎదురుచూపులకు 118 ద్వారా ఫలితం దక్కింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మించిన ఈ సినిమా నిన్న (మార్చి 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బేసిగ్గా మన వాళ్లకు థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈ జోనర్ సినిమాలకు మాత్రం ప్రతి ఒక్కరూ వెళ్లి చూస్తారు. కొంచెం కంటెంట్ ఉందా.. ఇక మనవాళ్లు హిట్ చేసేస్తారు. అలా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 118 కూడా మంచి థ్రిల్లర్ మూవీ గా టాక్ ను సొంతం చేసుకుంది.

`వెంకీమామ`లో రాశి సందడి మొదలైంది
గత ఏడాది విడుదలైన `తొలి ప్రేమ`తో నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది యువ కథానాయిక రాశీ ఖన్నా. ఆ తరువాత `శ్రీనివాస కళ్యాణం`లోనూ అలరించింది. ఈ మధ్యంతా తమిళ సినిమాలతో బిజీగా అయిపోయిన ఈ ఉత్తరాది భామ... ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలపైనా దృష్టి పెడుతోంది. ఒక వైపు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో కలసి క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్న రాశి... మరో వైపు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య మల్టీస్టారర్ మూవీ `వెంకీ మామ`లో ఓ నాయికగా నటిస్తోంది.

షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ 2 రిలీజ్
‘బాహుబలి’ సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం అటు ప్రభాస్ అభిమానులే కాదు..ప్రతి సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాడు. `బాహుబలి` సిరీస్ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కి పెద్ద పీట వేస్తున్నారు.

బాలయ్య - బోయపాటిల హ్యాట్రిక్ చిత్రం ఎప్పుడు? నిర్మాత ఎవరు?
'బా' అంటే బాలకృష్ణ - 'బో' అంటే బోయపాటి - ఈ ఇద్దరి కాంబినేషన్ గుర్తుకొస్తే 'సింహా' , 'లెజెండ్' అనే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ మన కళ్లముందు కదలాడతాయి.

హిట్ కాంబినేషన్స్ తో మూవీ
యంగ్ హీరో నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అవి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కూడా సాధించాయి. అలాగే నాగశౌర్య, మాళవిక నాయర్ కాంబినేషన్ లో కూడా గతంలో 'కళ్యాణ వైభోగమే' సినిమా వచ్చిన సంగతి విదితమే. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అలాంటిది ఇప్పుడు వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది.

సందీప్ కిషన్ కొత్త సినిమా అప్ డేట్
కామెడీ చిత్రాల దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక గత కొద్ది కాలంగా కర్నూల్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

50 డేస్ పూర్తి చేసుకున్న ఎఫ్2
అంతేగా అంతేగా అనుకుంటానే అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది ఎఫ్2 మూవీ. ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి ఫ్రస్టేషన్ కలిగించకుండా ఫుల్ ఫన్ ఇవ్వడంతో ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతి బరిలో ఎన్నో పెద్ద సినిమాలు బరిలో దిగినా... వాటిన్నింటినీ వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 రిలీజ్ టైమ్ ఫిక్స్
అటు ప్రభాస్ అభిమానులతో పాటు.. ఇటు సగటు సినీ ప్రేక్షకుల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సాహో సినిమా ఒకటి అని చెప్పొచ్చు. సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గత ఏడాది నుండే షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.