బాలయ్య – బోయపాటిల హ్యాట్రిక్ చిత్రం ఎప్పుడు? నిర్మాత ఎవరు?

When is Balakrishna and Boyapati Srinu Movie Releasing?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Balakrishna and Boyapati Srinu New Movie Updates,Balakrishna Next Film Producer,Balakrishna and Boyapati New Film Releasing Date,Balakrishna and Boyapati Upcoming Movie Release Date
When is Balakrishna and Boyapati Srinu Movie Releasing?

‘బా’ అంటే బాలకృష్ణ –
‘బో’ అంటే బోయపాటి –
ఈ ఇద్దరి కాంబినేషన్ గుర్తుకొస్తే ‘సింహా’ , ‘లెజెండ్’ అనే రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ మన కళ్లముందు కదలాడతాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2010 ఏప్రిల్ 30 న విడుదలైన ‘సింహా’, 2014 మార్చి 28న విడుదలైన ‘లెజెండ్’ చిత్రాలు బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ లో, ఇమేజ్ లో, ట్రేడింగ్ లో ఒక సరికొత్త మార్పును తేవడమే కాకుండా ఆయన కెరీర్లో ఒక ఫ్రెష్ ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టాయి. ఇప్పుడు మరలా ఐదేళ్లకు వారిద్దరి కాంబినేషన్ రిపీట్ కానుంది అన్న వార్త అభిమానుల్లో, మీడియాలో, ట్రేడ్ లో సంచలనం సృష్టిస్తోంది. అయితే సింహా, లెజెండ్ చిత్రాల నాటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి ఇద్దరు చాలా కష్ట కాలంలో ఉన్నారు. అఖండ విజయాల ఆనందాన్ని చవిచూసిన ఈ ఇద్దరు ఇప్పుడు అనూహ్య పరాజయాల అప్రదిష్టతో రగిలిపోతున్నారు. ఎవరికైనా జయాపజయాలు సహజం. కానీ ఈ 2019 సంక్రాంతి పోటీల్లో ఈ ఇద్దరి చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ పోటాపోటీగా విడుదలై చాలా అనూహ్యమైన రీతిలో పరాజయం పాలయ్యాయి. బాలకృష్ణకు ఆ తరువాత కూడా ఎన్టీఆర్ మహానాయకుడు రూపంలో మరో శరాఘాత అపజయం ఎదురయింది.

ఇక బోయపాటి విషయానికి వస్తే పరాజయంతో పాటు వివాదాలు, అపహాస్యాల ట్రోలింగ్స్ కూడా ఎదుర్కోవలసి వచ్చింది. వినయ విధేయ రామ హీరో రామ్ చరణ్ తో పరోక్షంగానూ, ఆ చిత్ర నిర్మాత డి.వి.వి. దానయ్యతో ప్రత్యక్షంగానూ విభేదాలు ఏర్పడి ఇమేజ్ పరంగా తీవ్ర సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నాడు సంచలన దర్శకుడు బోయపాటి. సరే… సినిమా అనే ఈ జిలుగు వెలుగుల పోటీ ప్రపంచంలో ఒక్కోసారి అనూహ్య పరిస్థితులు చుట్టుముట్టి ఎంతటివారినైనా ఇబ్బందుల పాలు చేస్తాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని మరలా పరాజయాలకు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా అద్భుత విజయాలను అందిపుచ్చుకోవడమే ధీరోదాత్త లక్షణం. అలాంటి పట్టుదల, మొండితనం విషయంలో హీరో బాలకృష్ణకు తగిన దర్శకుడు బోయపాటి . అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నది ‘మోస్ట్ హాట్ టాపిక్ ఆఫ్ టాలీవుడ్’ గా మారింది.

అటు ఎన్టీఆర్ కథానాయకుడు/ మహా నాయకుడు ఇటు వినయ విధేయ రామ చిత్రాల పరాజయానికి తక్షణ సమాధానంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన అత్యవసర స్థితిలో బాలకృష్ణ, బోయపాటి ఉన్నప్పటికీ పరిస్థితులు అందుకు అనుకూలించేలా లేవు. ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార బాధ్యతలను స్వీకరించడంతోపాటు మరలా పోటీచేసే ఉద్దేశ్యంలో నందమూరి బాలకృష్ణ ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ ఎక్కటానికి మరో నాలుగైదు నెలలు వెయిట్ చేయక తప్పేలా లేదు. తన సుదీర్ఘమైన కెరీర్లో బాలకృష్ణ ఇలాంటి జయాపజయాలను చాలా చూశారు. ఇలాంటి ఒడిదుడుకులకు చలించని మానసిక దృఢత్వాన్ని బాలకృష్ణ ఎప్పుడో అలవర్చుకున్నారు. కానీ బోయపాటి మాత్రం అందుకు భిన్నంగా “బాయిలింగ్ ఫర్నేస్” లాగా భగభగ మంటున్నాడు. మరలా సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తానా? … ఇప్పుడు ఎదురైన పరాభవ అపజయానికి ప్రతీకార విజయంతో సమాధానం చెప్పే రోజు ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తున్నాడు. మధ్యలో ఈ ఎన్నికల అవాంతరం ఎదురవ్వకపోతే ఈ నెలలోనో , ఏప్రిల్ ప్రారంభంలోనో ” స్టార్ట్ కెమెరా… యాక్షన్”- అని గర్జించేవాడు బోయపాటి .

ఎన్నికల అవాంతరం ఒక్కటే కాకుండా ఈ సెన్సేషనల్ కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రాన్ని నిర్మించే నిర్మాత ఎవరు అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఎన్టీఆర్ కథానాయకుడు/ మహా నాయకుడు చిత్రాల రిజల్ట్స్ చూసిన తరువాత సొంత చిత్ర నిర్మాణం తనకు అచ్చి వచ్చినట్లుగా లేదు అన్న సెంటిమెంట్ తో బాలకృష్ణ ఓన్ ప్రొడక్షన్ చేసే ఉద్దేశాన్ని విరమించుకున్నట్లుగా ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. హ్యాట్రిక్ విజయాల మైత్రి మూవీ మేకర్స్ వారి అడ్వాన్స్ బోయపాటి దగ్గర ఉన్నప్పటికీ నెంబర్ ఆఫ్ కమిట్మెంట్స్ కారణంగా వారు ఇప్పట్లో సుముఖంగా లేరని ఒక సమాచారం వినిపిస్తుంది. కాబట్టి బాలకృష్ణ బోయపాటిల కాంబినేషన్ కు హ్యాట్రిక్ ప్రొడ్యూసర్ ఎవరు అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే
ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పడు ప్రారంభమైనా ఎన్నికల తరువాత జూన్/ జులైలో ప్రారంభమైనా రిలీజ్ మాత్రం 2020 సంక్రాంతికే ఉంటుంది అన్నది ఖాయం. కాబట్టి ఈ హిట్ కాంబినేషన్ కు హ్యాట్రిక్ చిత్ర నిర్మాత ఎవరు అనే క్లారిటీ త్వరలోనే వస్తుంది.

సో… తమ కెరీర్ వరస్ట్ ఫెయిల్యూర్స్ కు బాలయ్య- బోయపాటిల నుండి ఎలాంటి ప్రతీకార విజయం వస్తుందో చూడాలి అంటే విజన్ 2020 దాకా వెయిట్ చేయక తప్పదు.

[subscribe]

[youtube_video videoid=HOcp8T7TM1g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + four =