షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 రిలీజ్ టైమ్ ఫిక్స్

Time Locked For Shades of Saaho Chapter 2 Launch,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shades of Saaho Chapter 2 Latest Updates,Time Fixed For Shades of Saaho Chapter 2 Launch,Shades of Saaho Chapter 2 Latest News,Saaho Chapter 2,Shades of Saaho Chapter 2 Will Be Out at Time
Time Locked For Shades of Saaho Chapter 2 Launch

అటు ప్రభాస్ అభిమానులతో పాటు.. ఇటు సగటు సినీ ప్రేక్షకుల సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సాహో సినిమా ఒకటి అని చెప్పొచ్చు. సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గత ఏడాది నుండే షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా గత వారం రోజులుగా షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 వీడియో రిలీజ్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 3 వ తేదీన ఈ సినిమాలో హీరోయిన్ అయిన శ్రద్దా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ కూడా అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా టైం కూడా ఫిక్స్ చేశారు. రేపు (మార్చి3) ఉదయం 8.20 గంటలకు షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 వీడియో రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా…  ఇంకా నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిర బేడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టు 15వ తేదీన తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో `సా హో` విడుద‌లచేయనున్నారు. మరి `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత ప్ర‌భాస్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. మరి చూద్దాం ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుదో?లేదో?

[subscribe]

[youtube_video videoid=huw6wD_1ppE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + ten =