
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 98


`సాహో`లో శ్రద్ధా కపూర్ పాత్ర అదేనా?

సిస్టర్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

గోవా లో ఇస్మార్ట్ శంకర్

అల్లు అర్జున్‌కి జోడీగా నాలుగోసారి...?

118 ఫస్ట్ డే కలెక్షన్స్

రకుల్ ప్రీత్ సింగ్... పదేళ్ళ తరువాత...

మరో బయోపిక్ మూవీ లో పాయల్ రాజపుత్

ఇది నా 11 ఏళ్ల కల - అడివి శేష్

మరో మెగా హీరోతో మైత్రీ మూవీ మేకర్స్?

నిర్మాతగా మారిన మహి వి రాఘవ

`జెర్సీ`... ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్

రష్మిక కంటిన్యూ చేస్తుందా?

మూవీ టైటిల్స్ కై నిర్మాతల పోటీ

స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ

యాత్ర క్లోజింగ్ కలెక్షన్స్

118 మూవీ మౌత్ టాక్

రిలీజయిన వన్ మ్యాన్ ఆర్మీ మూవీ ఫస్ట్ లుక్
అను ప్రొడక్షన్స్ &మ్యూజిక్ ఫ్రేమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు శివ దర్శకత్వంలో సందీప్ చీలం హీరోగా వన్ మ్యాన్ ఆర్మీ మూవీ రూపొందుతుంది. సందీప్ చీలం హీరోగా టాలీవుడ్ కు పరిచయమవుతున్న వన్ మ్యాన్ ఆర్మీ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో సందీప్ చీలం బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

`సాహో`లో శ్రద్ధా కపూర్ పాత్ర అదేనా?
హిందీనాట స్టార్ డమ్ పొందిన యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్... తెలుగునాట `సాహో` చిత్రంతో పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. `బాహుబలి` సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టే... తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. `రన్ రాజా రన్` ఫేం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని... సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సిస్టర్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది కామన్ థింగ్. ఒక ఫ్యామిలీలో ఒకళ్లు ఎంట్రీ అయితే చాలు.. తరువాత వారి బాటలోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంట్రీ ఇస్తారు. అయితే ఎంట్రీ అయితే ఈజీగా దొరుకుతుంది కానీ... కెరీర్ మాత్రం తమ టాలెంట్ పై ఆధారపడి ఉంటదనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే..ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి సిస్టర్ పూజ కన్నన్ ఎంట్రీ గురించి.

గోవా లో ఇస్మార్ట్ శంకర్
పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మి )నిర్మాణ సారధ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో గా ఇస్మార్ట్ శంకర్ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో హీరో రామ్ ను రఫ్ లుక్ తో, డిఫరెంట్ క్యారెక్టర్ లో జగన్నాథ్ ప్రెజెంట్ చేస్తున్నారు. నభా నటేష్, నిధి అగర్వాల్ కథా నాయికలు. మణిశర్మ సంగీతమందిస్తున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ లో పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజీ, ఆశీష్ విద్యార్థి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

అల్లు అర్జున్‌కి జోడీగా నాలుగోసారి...?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా... వారిలో ఒకరిగా ఇప్పటికే పూజా హెగ్డే ఎంపికయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరో హీరోయిన్ గా కేథరిన్ ట్రెసా పేరు పరిశీలనలో ఉందని సమాచారం.

118 ఫస్ట్ డే కలెక్షన్స్
మొత్తానికి పటాస్ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ మంచి హిట్టు కొట్టాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకత్వంలో... ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు కూడా బాాగానే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం మొదటి రోజు దాదాపుగా 1.50 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఇప్పట్లో రిలీజ్ కు ఏం సినిమాలు కూడా లేవు కాబట్టి.. 118 కు కలెక్షన్ల పరంగా బాగానే కలిసొస్తుంది. మరి నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

రకుల్ ప్రీత్ సింగ్... పదేళ్ళ తరువాత...
తెలుగునాట అగ్ర కథానాయికగా రాణిస్తున్న అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు ఈ తరం అగ్ర కథానాయకులందరితోనూ రకుల్ ఆడిపాడింది. కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం కాకుండా... తమిళ, హిందీ చిత్రాలతోనూ ఈ ఉత్తరాది సోయగం ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం రకుల్ నటిస్తున్న తమిళ చిత్రాలలో `ఎన్జీకే` ఒకటి. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ రాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ... వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరో బయోపిక్ మూవీ లో పాయల్ రాజపుత్
బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమయిన పాయల్ రాజపుత్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . హీరోయిన్ గా మూవీ ఆఫర్స్ అనేకం ఉన్నా పాయల్ సెలెక్టెడ్ గా మూవీస్ కి అంగీకరిస్తున్నారు. లెజండరీ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ లో జయసుధ గా అతిథి పాత్రలో పాయల్ నటించారు. సీనియర్ హీరోలు కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సినిమాలు ఓకే చేశారు. సూపర్ హిట్ మన్మథుడు మూవీ సీక్వెల్ మన్మథుడు2, మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

విశ్వాసం తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. క్లాస్ ఆడియన్స్ కు సినిమా ఎంత వరకూ కనెక్ట్ అవుతుందో చెప్పలేం.

ఇది నా 11 ఏళ్ల కల - అడివి శేష్
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు జీ మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ (జీఎంబీ) సంయుక్తంగా.. 26/11ముంబై అటాక్ నేపథ్యంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వీర జవాన్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే కదా. మేజర్ అనే టైటిల్ తో తెరకెక్కునున్న ఈ సినిమాలో సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో గత ఏడాది గూఢచారి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అడివి శేష్ నటిస్తున్నాడు.

మరో మెగా హీరోతో మైత్రీ మూవీ మేకర్స్?
`శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `రంగస్థలం` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తూ ఈ ప్రొడక్షన్ హౌస్... టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతోంది. ఇదిలా ఉంటే... మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని కూడా ఈ నిర్మాణ సంస్థ టేకప్ చేయనుందని టాలీవుడ్ టాక్.

నిర్మాతగా మారిన మహి వి రాఘవ
పాఠశాల సినిమాతో దర్శకుడిగా మారిన మహి.వి రాఘవ్ తాజాగా యాత్ర సినిమాతో మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు మంచి టాక్ రావడమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు తాజాగా మహి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందేంటంటే.. మహి వి రాఘవ మరియు అతని సన్నిహితులైన శివమేక, రాకేష్ మంహకాళి సంయుక్తంగా త్రీ ఆటమన్ లీవ్స్ పేరిట ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు.

`జెర్సీ`... ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్
నేచురల్ స్టార్ నాని... మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ పాత్రలో కనిపించనున్న చిత్రం `జెర్సీ`. `మళ్ళీ రావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. కోలీవుడ్ సంగీత సంచలనం అనిరుధ్ స్వరాలు అందిస్తున్నాడు. కాగా... ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

రష్మిక కంటిన్యూ చేస్తుందా?
గత ఏడాది `ఛలో`, `గీత గోవిందం` చిత్రాలతో తెలుగునాట సంచలనం సృష్టించిన కన్నడ బ్యూటీ రష్మిక. ప్రస్తుతం విజయ్ దేవరకొండకి జోడీగా `డియర్ కామ్రేడ్`లో నటిస్తూ బిజీగా ఉంది. `గీత గోవిందం` తరువాత వీరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై సహజంగానే అంచనాలు ఉన్నాయి.

మూవీ టైటిల్స్ కై నిర్మాతల పోటీ
జమ్ము కశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. IAF జరిపిన సర్జికల్ స్ట్రైక్-2 సంఘటనలతో మూవీస్ నిర్మించేందుకు బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి గా ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో రూపొందిన యూరి:ది సర్జికల్ స్ట్రైక్ హిందీ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ , పుల్వామా ఉగ్రదాడి నేపధ్యం లో రూపొందించే దేశ భక్తి మూవీస్ టైటిల్స్ రిజిస్ట్రేషన్స్ కు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.

స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ
సమంత , నయనతార టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకునే నయనతార, సమంత లకు అభిమానగణం అధికమే. వారిద్దరూ నటించిన తమిళ మూవీస్ ఒక రోజు తేడాతో మా ర్చి నెలలో రిలీజ్ కానున్నాయి. అవే డేట్స్ లో తెలుగు లో కూడా రిలీజ్ కానున్నాయి.

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ నుండి పాపులర్ రైటర్ లుక్ రిలీజ్
'వినాయకుడు'.. 'కేరింత' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాయికిరణ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాన్పెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' రూపొందుతోంది. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో సాషా ఛెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, అబ్బూరి రవి, అనీశ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

యాత్ర క్లోజింగ్ కలెక్షన్స్
మహి. వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ పై.. ముఖ్యంగా వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి అయితే సేమ్ వైఎస్ లాగానే కనిపించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్ల పరంగా కూడా సినిమా పర్వావలేదనిపిస్తోంది. ప్రస్తుతం ఆ టైంలో సినిమాలు కూడా పెద్దగా లేకపోవడం... యాత్ర సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో బాగానే కలెక్షన్స్ రాబట్టింది. నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయుకుడు పార్ట్ లకు సరైస…

118 మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.
