పటాస్ సినిమా తరువాత సరైస సక్సెస్ కోసం వేయి కళ్లతో చూసిన ఎదురుచూపులకు 118 ద్వారా ఫలితం దక్కింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మించిన ఈ సినిమా నిన్న (మార్చి 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బేసిగ్గా మన వాళ్లకు థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈ జోనర్ సినిమాలకు మాత్రం ప్రతి ఒక్కరూ వెళ్లి చూస్తారు. కొంచెం కంటెంట్ ఉందా.. ఇక మనవాళ్లు హిట్ చేసేస్తారు. అలా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 118 కూడా మంచి థ్రిల్లర్ మూవీ గా టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు హిట్ టాక్ రావడంతో చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ…118 విజయంతో నా జీవితాంతం రుణపడిపోయే ఫీలింగ్ కలిగించారు. మీరు ఈ సినిమాను యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే నేను చాలా బాధపడేవాన్నేమో? ఒక చిన్న గట్ ఫీలింగ్ వచ్చింది. ప్రేక్షకులకు కొత్తగా ఏమైనా ఇస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు.. వారి గుండెల్లో పెట్టుకుంటారనే ఒక చిన్న నమ్మకం ఏర్పడింది. సినిమాను హిట్ చేసిన అందరికీ చాలా థాంక్స్ అన్నారు. అంతేకాదు..నా తమ్ముడు తారక్ ఎవరూ చూడక ముందు ఈ సినిమా చూశారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పాడు. అతడి నమ్మకం నిజమైంది. మా మీద నమ్మకంతో సినిమాను కొన్న దిల్ రాజు గారికి కూడా ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు.
కాగా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్,షాలిని పాండే హీరోయిన్లుగా నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
[youtube_video videoid=2mxmR26ITCg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: