50 డేస్ పూర్తి చేసుకున్న ఎఫ్2

Sankranthi Blockbuster F2 Completes 50 Days,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,F2 Movie Completes 50 Days,Fun and Frustration Movie Completes 50 Days,F2 Movie Latest Updates,Venkatesh and Varun Tej F2 Movie Finished 50 Days,F2 Telugu Movie Completes 50 Days
Sankranthi Blockbuster F2 Completes 50 Days

అంతేగా అంతేగా అనుకుంటానే అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది ఎఫ్2 మూవీ. ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి ఫ్రస్టేషన్ కలిగించకుండా ఫుల్ ఫన్ ఇవ్వడంతో ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతి బరిలో ఎన్నో పెద్ద సినిమాలు బరిలో దిగినా… వాటిన్నింటినీ వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజుల్లో ఒక సినిమా రెండు మూడు వారాలు ఆడటమే గొప్ప అనుకుంటుంటే ఈ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఒక వేళ 50 రోజులు పూర్తి చేసుకున్నా..మహా అయితే ఓ 50 నుంచి 60 సెంటర్లలో పూర్తవుతుంది. కానీ ఎఫ్ 2 సినిమా విషయంలో మాత్రం ఆ లెక్కలు మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 106 కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ ట్విట్టర్ ఖాతా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొత్త పోస్టర్లు విడుదల చేసింది.

ఇక కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 50 రోజులైనా కలెక్షన్ల్ పరంగా ఎక్కడా వెనకపడలేదు. ఇప్పటికి కూడా మంచి వసూళ్ల ని రాబడుతూ..140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డులకెక్కింది.

కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈసినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల పక్కన తమన్నా, మెహ్రీన్ నటించారు.

[subscribe]

[youtube_video videoid=6KqMKsyKD6A]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 4 =