బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ LLP &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై టి ఎన్.సంతోష్ దర్శకత్వం లో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా జర్నలిజం నేపధ్యం లో రూపొందిన అర్జున్ సురవరం మూవీ మార్చి 29 వ తేదీ రిలీజ్ కానుంది. కనిదన్ తమిళ మూవీ తెలుగు రీమేక్ అర్జున్ సురవరం మూవీ లో నిఖిల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా మొదటిసారి నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన అర్జున్ సురవరం మూవీ టీజర్ ను శివరాత్రి పర్వదిన సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా స్టార్ చిరంజీవి కూడా టీజర్ ను ప్రశంసించారు. ఈ చిత్ర నిర్మాతలకు టీజర్ చాలా ఆసక్తిగా ఉందని ప్రశంసిస్తూ చిరంజీవి పర్సనల్ గా మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ ను నిర్మాతలు హీరో నిఖిల్ కు అందజేయగా నిఖిల్ ఆనందానికి హద్దులు లేవు. మెగా స్టార్ చిరంజీవి మెసేజ్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన జీవితం లో ఇది అతి పెద్ద సంతోష సంఘటన అని నిఖిల్ ట్వీట్ చేశారు
[youtube_video videoid=nnl_cL9PZ8U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: