`వెంకీమామ‌`లో రాశి సంద‌డి మొద‌లైంది

Raashi Khanna Starts Shooting for Venky Mama,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Venky Mama Movie Shooting Latest Updates,Raashi Khanna to Act in Venky Mama Movie,Raashi Khanna to Begins Shoot For Venky Mama,Venky Mama Telugu Movie Shooting News
Raashi Khanna Starts Shooting for Venky Mama

గ‌త ఏడాది విడుద‌లైన `తొలి ప్రేమ‌`తో న‌టిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది యువ క‌థానాయిక రాశీ ఖ‌న్నా. ఆ త‌రువాత `శ్రీ‌నివాస క‌ళ్యాణం`లోనూ అల‌రించింది. ఈ మ‌ధ్యంతా త‌మిళ సినిమాల‌తో బిజీగా అయిపోయిన ఈ ఉత్త‌రాది భామ‌… ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాల‌పైనా దృష్టి పెడుతోంది. ఒక వైపు యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌ల‌సి క్రాంతి మాధ‌వ్ రూపొందిస్తున్న సినిమాలో న‌టిస్తున్న రాశి… మ‌రో వైపు విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వెంకీ మామ‌`లో ఓ నాయిక‌గా న‌టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా `వెంకీ మామ‌` రెగ్యుల‌ర్ షూటింగ్ రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో గోదావరి గట్టున గల ఓ పచ్చటి పల్లెలో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. తొలి స‌న్నివేశంగా… సిటీ నుండి వ‌చ్చిన చైతూని ఊళ్ళో ఉండే వెంకీ రిసీవ్ చేసుకునే దృశ్యాన్ని చిత్రీక‌రించారు. కాగా… శ‌నివారం నుంచి రాశి కూడా షూటింగ్‌లో జాయిన్ అయింద‌ట‌. మ‌రికొద్ది రోజుల పాటు రాశికి సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని స‌మాచారం.

సురేష్ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టిస్తుండ‌గా… బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

[subscribe]

[youtube_video videoid=a8jLt8-NJCI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + six =