
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 86

ఫ్యాన్సీ రేటుకు విశ్వామిత్ర శాటిలైట్ రైట్స్

కాజల్ సీత విడుదల కష్టమే

చిన్నికృష్ణకు ప్రముఖ రైటర్ ఆకుల శివ కౌంటర్

చరణ్ కు బిగ్ బి సర్ ప్రైజ్

మేనల్లుడికి అతిథిగా మామ!

ప్రారంభమైన గోపీచంద్ కొత్త సినిమా

ఇస్మార్ట్ శంకర్ మూవీ గోవా షూటింగ్ షెడ్యూల్ పూర్తి

ధనుష్ చిత్రంలో విలన్‌గా నవీన్ చంద్ర?

పండగలను టార్గెట్ చేసుకున్న సూర్య

పాత టైటిల్స్‌తో ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోని

చిరంజీవి `ఆరాధన`కి 32 ఏళ్ళు

సద్గురుతో చందమామ

నిగర్వి అయిన చిరంజీవిని గర్విష్టిని చేసిన రామ్ చరణ్

కిల్లర్ స్నీక్ పీక్ టీజర్, ఆడియో రిలీజ్

దేవి 2 టీజర్ రిలీజ్

సూర్యకాంతం ట్రైలర్ రిలీజ్

సమ్మర్ రేస్ లోనే అల్లు శిరిష్ ఎబిసిడి

మళ్ళీ టార్గెట్ చేసిన సూపర్ స్టార్
1995 సంక్రాంతికి `బాషా`తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్... సుదీర్ఘ విరామం (24 ఏళ్ళు) తరువాత ఈ ఏడాది సంక్రాంతికి `పేట`తో అభిమానులను పలకరించాడు. కట్ చేస్తే... తన తదుపరి చిత్రాన్ని కూడా ఇదే సీజన్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట సూపర్ స్టార్.
లక్ష్మీస్ ఎన్టీఆర్ క్రేజ్ - స్పీడుమీదున్న ఓపెనింగ్స్
లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ ఈ టైటిల్ ను ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటినుండి ఈ సినిమా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. దానికి తోడు వర్మ తన సినిమాను మాములుగా ప్రమోషన్ చేయడుగా..సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ దానిపై ఏదో ఒక చర్చ జరగాల్సిందే. ఇక ఇన్నిరోజులు తనదైన శైలిలో ప్రమోషన్ చేసిన వర్మ మరోసారి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జనాల్లో ఉన్న క్రేజ్ గురించి చెబుతున్నాడు.
ఫ్యాన్సీ రేటుకు విశ్వామిత్ర శాటిలైట్ రైట్స్
గీతాంజలి, త్రిపుర వంటి హార్రర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ రాజ కిరణ్. ఇప్పుడు నందితా శ్వేత, సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్న కుమార్ ప్రధాన పాత్రల్లో మరోసారి అలాంటి జోనర్ లోనే విశ్వామిత్ర అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాడు.

కాజల్ సీత విడుదల కష్టమే
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సీత. కథానాయిక ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో కాజల్ మొదలిసారిగా నెగిటివ్ షేడ్ లో నటించనుంది. ఇక విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఆరోజు ఈ సినిమా రిలీజ్ అవ్వడం కాస్త కష్టమే అని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల వలన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారట. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కానీ ఏ విషయం తెలియదు.

చిన్నికృష్ణకు ప్రముఖ రైటర్ ఆకుల శివ కౌంటర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రైటర్ చిన్నికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్ర రాజకీయాల్లో వేలుపెడుతూ కేసీఆర్ వైసీపీకి మద్దతు తెలుపుతున్నారని.. తెలంగాణలో ఏపీ ప్రజలను సమస్యలకు గురిచేస్తున్నారని పవన్ పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. వాటిపై స్పందించిన చిన్నికృష్ణ పవన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. అక్కడితో ఆగకుండా వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్, చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో చిన్నికృష్ణపై మెగా అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించి…

చరణ్ కు బిగ్ బి సర్ ప్రైజ్
ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్బంగా... బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా చెర్రీ కి ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వీడియోను పంపించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుగులో చరణ్ కు శుభాకాంక్షలు చెప్పి ఆశ్చర్యపరిచారు అమితాబ్ బచ్చన్. ఆ వీడియోను ఉపాసన తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మరి అమితాబ్ వీడియోను మీరు కూడా చూడండి.

మేనల్లుడికి అతిథిగా మామ!
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మజిలీపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నాగచైతన్య.. సమంత మధ్య ఎమోషన్ సీన్స్ .. చైతు రఫ్ లుక్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఆడియోకు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.

ప్రారంభమైన గోపీచంద్ కొత్త సినిమా
యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తిరు దర్శకత్వంలో రూపొందుతున్న పూర్తి ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హీరో గోపీచంద్ మరో కొత్త సినిమా ప్రారంభమయింది. మంచి ముహూర్తానికి ప్రారంభమయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభమవుతుంది. ప్రముఖ దర్శకుడు సంతోష్ శివన్ వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో భోగవిల్లి ప్రసాద్ నిర్మాతగా ఈ మూవీ రూపొందనుంది.

ఇస్మార్ట్ శంకర్ మూవీ గోవా షూటింగ్ షెడ్యూల్ పూర్తి
పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ &ఛార్మి ) నిర్మాణ సారధ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.సగానికి పైగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ తదుపరి షూటింగ్ షెడ్యూల్ వారణాసి లో జరుగనుందని సమాచారం.

ధనుష్ చిత్రంలో విలన్‌గా నవీన్ చంద్ర?
`సంభవామి యుగే యుగే`, `కళ్యాణం` వంటి చిత్రాల్లో నటించినా... `అందాల రాక్షసి`తో నటుడిగా మంచి మార్కులు సంపాదించాడు యువ కథానాయకుడు నవీన్ చంద్ర. ఆ తరువాత కొన్ని ఆసక్తికరమైన చిత్రాల్లో నటించినా ఆశించిన విజయాన్నైతే అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో `నేను లోకల్`, `దేవదాస్`, `అరవింద సమేత` వంటి చిత్రాల్లో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రల్లో అలరించాడు. ముఖ్యంగా `అరవింద సమేత` నవీన్‌కి నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ చిత్రంలోని పెర్ఫార్మెన్స్... ఓ తమిళ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశాన్ని అందించిందని కోలీవుడ్ టాక్.

పండగలను టార్గెట్ చేసుకున్న సూర్య
`24` తరువాత కోలీవుడ్ స్టార్ సూర్య ఖాతాలో సరైన విజయం పడలేదనే చెప్పాలి. ఆ తరువాత వచ్చిన `యముడు 3` ఆశించిన విజయం సాధించలేదు. అలాగే... గత చిత్రం `గ్యాంగ్` కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో... తదుపరి చిత్రాలపై సూర్య అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.

లక్కీ డేట్‌కి ప్రారంభం కానున్న సూపర్ స్టార్ కొత్త చిత్రం?
సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. కాగా... ఈ సంక్రాంతికి `పేట`తో పలకరించిన రజినీ... ప్రస్తుతం కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. పాన్ - ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. రజినీకి జోడీగా నయనతార, కీర్తి సురేష్ నటించబోతున్నారని సమాచారం. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరాలు అందించనున్నాడు.

పాత టైటిల్స్‌తో ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోని
మూడేళ్ళ క్రితం వేసవి కానుకగా విడుదలైన తమిళ అనువాద చిత్రం `బిచ్చగాడు`... తెలుగునాట వసూళ్ళ వర్షం కురిపించింది. ఆ సినిమా ఘనవిజయంతో ఆ చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోనికి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే... ఎటొచ్చి ఆ తరువాత వచ్చిన విజయ్ చిత్రాలేవీ ఆశించిన విజయం సాధించలేకపోయాయి. అయినప్పటికీ వరుస సినిమాలతో పలకరిస్తూనే ఉన్నాడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్.

చిరంజీవి `ఆరాధన`కి 32 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి నటనావైభవానికి ప్రతీకగా నిలిచిన చిత్రాలలో `ఆరాధన` (1987) ఒకటి. ఇందులోని పులిరాజు పాత్రలో చిరు ఎంతో ఒదిగిపోయి నటించారు. రెండు ఛాయలున్న ఈ పాత్రలో తన అభినయం సినిమాకి ఊపిరి పోసింది. చిరుకి జోడీగా సుహాసిని, రాధిక నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ ఓ ముఖ్య పాత్రలో నటించాడు. తమిళ చిత్రం `కడలోర కవితగళ్`(సత్యరాజ్, రేఖ) ఆధారంగా తమిళ దర్శకుడు భారతీరాజా రూపొందించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించాడు.

సద్గురుతో చందమామ
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు దైవభక్తి ఎక్కువే అన్న విషయం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న ఈషా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో కూడా కాజల్ పాల్గొంది. ఇక ఇప్పుడు తాజాగా సద్గురు జగ్గీవాసుదేవ్‌తో కలిసి ఈ చందమామ ఆధ్యాత్మికత, జీవితం, శాంతి ఇలా అనేక విషయాలపై ముచ్చటించారు. ఆ వీడియో మీరు కూడా చూడండి..

నిగర్వి అయిన చిరంజీవిని గర్విష్టిని చేసిన రామ్ చరణ్
హీరోగా కెరీర్ ప్రారంభించాక రెండవ చిత్రానికే ఫిలిం ఇండస్ట్రీకి ఒక సరికొత్త రికార్డును సెట్ చేసాడు రామ్ చరణ్. ఇది ఏ వారసత్వ హీరోకు దక్కని అరుదైన అదృష్టం. ఇది వ్యక్తిగతంగా తనకు మాత్రమే కాదు... తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ప్రతిష్టాత్మక విశేషమనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చాలామంది అగ్ర తారలు తమ కుమారులను హీరోలుగా పరిచయం చేసినప్పటికీ రెండవ సినిమాకే రికార్డులు బద్దలు కొట్టిన దాఖలాలు లేవు. ఆ ఘనత కుమారుడు రామ్ చరణ్ ద్వారా దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తొలి చిత్రం “చిరుత ” లోనే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్ చరణ్ రెండవ చిత్రం “మగధీర” లోనే నటన పరంగా అంత…

కిల్లర్ స్నీక్ పీక్ టీజర్, ఆడియో రిలీజ్
ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా కొలైకరన్. తెలుగులో కిల్లర్ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. దియా మూవీస్ పతాకంపై ప్రదీప్ ఈసినిమాను నిర్మిస్తుండగా..తెలుగులో చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా స్నీక్ పీక్ టీజర్ ను అలాగే ఆడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో

దేవి 2 టీజర్ రిలీజ్
ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవ, తమన్నా ప్రధాన పాత్రల్లో దేవి అనే తమిళ హార్రర్ సినిమా 2016 లో రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈసినిమా విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో అభినేత్రి టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు దేవి సినిమాకు సీక్వెల్ గా దేవి 2 సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

సూర్యకాంతం ట్రైలర్ రిలీజ్
నిహారిక, రాహుల్ విజయ్, పర్లీన్ బసానియా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం సూర్యకాంతం. నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌తో పాటు పలు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

సమ్మర్ రేస్ లోనే అల్లు శిరిష్ ఎబిసిడి
గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాతో అయినా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం గత ఏడాదే పూర్తి చేసుకున్నా రిలీజ్ కు మాత్రం ఇంకా నోచుకోలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ వెనుక కూడా ఓ కారణం ఉందనుకోండి. ఇటీవలే ఈ సినిమాను సురేష్ బాబు మరియు అల్లు అరవింద్ కు చూపించగా ఇద్దరూ కొన్ని మార్పులు చెప్పారంటా. ఇక వారు చెప్పిన మార్పులను కంప్లీట్ చేసుకొని.. ఇప్పుడు రిలీజ్ కు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన…