తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సీత. కథానాయిక ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో కాజల్ మొదలిసారిగా నెగిటివ్ షేడ్ లో నటించనుంది. ఇక విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఆరోజు ఈ సినిమా రిలీజ్ అవ్వడం కాస్త కష్టమే అని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల వలన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారట. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కానీ ఏ విషయం తెలియదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కవచం సినిమాలో సందడి చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ మరోసారి సీత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అంతేకాదు మరి`లక్ష్మీ కళ్యాణం`, `నేనే రాజు నేనే మంత్రి` తరువాత తేజ – కాజల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావండంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ ఆంచనాలను వీరు రీచ్ అవుతారో? లేదో? చూద్దాం..
ఇంకా ఈ సినిమాలో మన్నారా చోప్రా, సోనూ సూద్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అనిల్ సుంకర, కిషోర్ గరికపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=FeLU_LM1mSs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: