యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తిరు దర్శకత్వంలో రూపొందుతున్న పూర్తి ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హీరో గోపీచంద్ మరో కొత్త సినిమా ప్రారంభమయింది. మంచి ముహూర్తానికి ప్రారంభమయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభమవుతుంది. ప్రముఖ దర్శకుడు సంతోష్ శివన్ వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో భోగవిల్లి
ప్రసాద్ నిర్మాతగా ఈ మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిర్మాత భోగవిల్లి ప్రసాద్, హీరో గోపీచంద్ కాంబినేషన్ లో సాహసం మూవీ ఘన విజయం సాధించింది. సాహసం మూవీ బోర్డర్ ప్రాంతాలలో రూపొందింది. ఇప్పుడు ఈ మూవీ మేజర్ షూటింగ్ పార్ట్ నేపాల్ లో జరుగనుంది. నిర్మాత భోగవిల్లి ప్రసాద్, హీరో గోపీచంద్ కాంబినేషన్ చాలా కాలం తరువాత రిపీట్ అయింది. మిగతా తారాగణం, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెల్లడవుతాయి. దర్శకుడు సంపత్ నంది మూవీకి కూడా హీరో గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
After superhit #Saahasam, We’re happy to announce that our next film with @YoursGopichand has completed its Puja formalities. Debutant #BinuSuramanyam is directing the film and #SatishK handles the camera. Regular shoot begins from June. Stay tuned for more details!#SVCC26 pic.twitter.com/8nRnhLlq8m
— SVCC (@SVCCofficial) March 27, 2019
[youtube_video videoid=9jOVc1hBOEE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: