ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా కొలైకరన్. తెలుగులో కిల్లర్ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. దియా మూవీస్ పతాకంపై ప్రదీప్ ఈసినిమాను నిర్మిస్తుండగా..తెలుగులో చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా స్నీక్ పీక్ టీజర్ ను అలాగే ఆడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆండ్రూ లూయిస్ మాట్లాడుతూ..నాకు తెలుగు రాకున్నా ,తెలుగు వారికి నచ్చే సినిమా తీశాము. విజయ్ ఆంటోని నా స్నేహితుడు.. తన వల్లే ఈ సినిమా చేశాను. అర్జున్ గారు మా సినిమాలోకి రావటమే మా మొదటి సక్సెస్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్.. టెక్నికల్ గా కిల్లర్ నెక్ట్స్ లెవెల్ మూవీ.. నిర్మాత ప్రదీప్ సపోర్ట్ మాకు ప్రధాన బలమన్నారు.
అర్జున్ మాట్లాడుతూ.. కిల్లర్ సినిమాలో చాలా రొజుల తర్వాత పోలీస్ గా చేస్తున్నా. ఇదొక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్.. నా పాత్ర కూడా ప్రత్యేకంగా ఉంటుంది.. దర్శకుడి ప్రతిభ, తాను రాసిన కథనం ఈ సినిమాకు ప్రధాన బలం.. విజయ్ ఆంటోని మంచి మనిషి. కిల్లర్ ఎవరనేది సినిమా చూసి తెలుసుకోవాలన్నారు.
విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. అర్జున్ గారితో కలిసి ఈ సినిమా చేయటం నా అదృష్టం. ఆయన యాక్షన్ స్టైల్ కింగ్. ఆండ్రూ నా స్నేహితుడే.. అషిమా ఈ సినిమాతో డ్రీమ్ గర్ల్ గా మారుతుంది. ప్రదీప్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీశారు. చదలవాడ శ్రీనివాసరావు గారు నాకు గాడ్ ఫాదర్. భాష్య శ్రీ నాకు మరో సోదరుడు. తను లేకుండా నా సినిమా తెలుగులోకి రాదు. మంచి సినిమా చేశాము. హాలీవుడ్ తరహా సాంకేతికత మా సినిమాలో చూస్తారన్నారు.మే లో విడుదల చేస్తామన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అర్జున్, విజయ్ ఆంథోని తెలుగులో హిట్స్ ఇచ్చిన నటులు. వారు గౌరవ ప్రదమైన నటులు. వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నానన్నారు.
[youtube_video videoid=G5idz9r6bzM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: