మెగాస్టార్ చిరంజీవి నటనావైభవానికి ప్రతీకగా నిలిచిన చిత్రాలలో `ఆరాధన` (1987) ఒకటి. ఇందులోని పులిరాజు పాత్రలో చిరు ఎంతో ఒదిగిపోయి నటించారు. రెండు ఛాయలున్న ఈ పాత్రలో తన అభినయం సినిమాకి ఊపిరి పోసింది. చిరుకి జోడీగా సుహాసిని, రాధిక నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ ఓ ముఖ్య పాత్రలో నటించాడు. తమిళ చిత్రం `కడలోర కవితగళ్`(సత్యరాజ్, రేఖ) ఆధారంగా తమిళ దర్శకుడు భారతీరాజా రూపొందించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరకల్పనలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా `అరె ఏమైందీ` గీతం ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. చిరు తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండో పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల కావడం విశేషం. 1987 మార్చి 27న విడుదలైన `ఆరాధన`… నేటితో 32 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
[youtube_video videoid=_phcQ0DrIVM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: