నిహారిక, రాహుల్ విజయ్, పర్లీన్ బసానియా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం సూర్యకాంతం. నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌తో పాటు పలు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పణ లో రూపొందుతున్న ఈ సినిమాను నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై సందీప్ యెర్రంరెడ్డి నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఒక మనసు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకొని ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నటించి మరోసారి అలరించింది మెగా హీరోయిన్ నిహారిక. అయితే ఈ రెండు సినిమాల్లో కాస్త సైలెంట్ గా… ఇన్నోసెంట్ కార్యెక్టర్ లో నటించగా.. ఈ సినిమాలో మాత్రం కాస్త డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. నిహారిక పాత్రే సినిమాకు హైలెట్ గా నిలిచేలా కనిపిస్తోంది. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా నిహారికకు మంచి బ్రేక్ వస్తుందేమో?
[youtube_video videoid=nEBGu3Lqv2A]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: