మూడేళ్ళ క్రితం వేసవి కానుకగా విడుదలైన తమిళ అనువాద చిత్రం `బిచ్చగాడు`… తెలుగునాట వసూళ్ళ వర్షం కురిపించింది. ఆ సినిమా ఘనవిజయంతో ఆ చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోనికి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే… ఎటొచ్చి ఆ తరువాత వచ్చిన విజయ్ చిత్రాలేవీ ఆశించిన విజయం సాధించలేకపోయాయి. అయినప్పటికీ వరుస సినిమాలతో పలకరిస్తూనే ఉన్నాడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ మధ్య విజయ్ ఆంటోని హీరోగా వస్తున్న తమిళ అనువాద చిత్రాలను గమనిస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. అదేమిటంటే… పాత టైటిల్స్‌తోనే ఈ హీరో నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి. ఆ మధ్య `రోషగాడు` (చిరంజీవి పాత సినిమా టైటిల్)తో పలకరించిన విజయ్… అతి త్వరలో `జ్వాల` (ఇది కూడా చిరంజీవి పాత సినిమా టైటిలే), `కిల్లర్` (నాగార్జున పాత సినిమా టైటిల్) చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి… ఈ పాత టైటిల్స్ విజయ్‌కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
[youtube_video videoid=zotePVKInJw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: