శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మజిలీపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నాగచైతన్య.. సమంత మధ్య ఎమోషన్ సీన్స్ .. చైతు రఫ్ లుక్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఆడియోకు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే చై, సామ్ ఇద్దరూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు దర్శక నిర్మాతలు. మార్చి 30 వ తేదీన హైదరాబాద్ లో ‘మజిలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విక్టరీ వెంకటేష్ రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు వెంకీ, నాగచైతన్య కలిసి ప్రస్తుతం వెంకీమామ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాశిఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అతిథిగా వస్తే మజిలీ సినిమాతో పాటు పనిలో పనిగా వెంకీమామ సినిమా ప్రమోషన్ కు కూడా వర్కవుట్ అవుద్దని ఆలోచిస్తున్నారట.
కాగా మజిలీ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ మరోక కీలక పాత్రలో నటిస్తుంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గోపిసుందర్ పాటలు అందించగా.. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
[youtube_video videoid=NWz9pdR3reQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: