జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రైటర్ చిన్నికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్ర రాజకీయాల్లో వేలుపెడుతూ కేసీఆర్ వైసీపీకి మద్దతు తెలుపుతున్నారని.. తెలంగాణలో ఏపీ ప్రజలను సమస్యలకు గురిచేస్తున్నారని పవన్ పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. వాటిపై స్పందించిన చిన్నికృష్ణ పవన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. అక్కడితో ఆగకుండా వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్, చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో చిన్నికృష్ణపై మెగా అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించి చిన్నికృష్ణపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ వివాదంపై ప్రముఖ రచయిత ఆకుల శివ కూడా స్పందించి చిన్ని కృష్ణకు కౌంటర్ ఇచ్చారు. ఓ వీడియో ద్వారా చిన్ని కృష్ణపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్ని కృష్ణ పెద్ద చీటర్ అని.. తన కెరీర్ మొత్తం అతడు పక్కవాడి వర్క్ ని కాపీ కొడుతూనే వచ్చాడని అన్నారు. “ఇంద్రలాంటి హిట్ సినిమాకి కథ ఇచ్చినా…మెగాస్టార్ చిరంజీవి తనని ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదు. బాల్ పెన్ ఇవ్వలేదు అంటూ కూతలు కూస్తున్నావ్. నీ చరిత్ర బయటపెట్టనా? నీ గురించి తెలిసినవాడు ఎవడైనా ఇంటికి భోజనానికి పిలుస్తాడా? నన్ను సురేష్‌బాబు అనేక సార్లు ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు.. నిన్ను మాత్రం ఎవరూ పిలవరు. నీ చరిత్ర అలాంటిది,” అంటూ దుమ్మెత్తిపోశారు. అలాగే చిన్నికృష్ణ వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు వ్యాఖ్యలుచేశారు ఆకుల శివ. ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి..
[youtube_video videoid=TN3AKaGH97w]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: