`24` తరువాత కోలీవుడ్ స్టార్ సూర్య ఖాతాలో సరైన విజయం పడలేదనే చెప్పాలి. ఆ తరువాత వచ్చిన `యముడు 3` ఆశించిన విజయం సాధించలేదు. అలాగే… గత చిత్రం `గ్యాంగ్` కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో… తదుపరి చిత్రాలపై సూర్య అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… సూర్య నటిస్తున్న తాజా చిత్రాలు పండగలను టార్గెట్ చేసుకుని కేవలం మూడు నెలల గ్యాప్‌లో రాబోతున్నాయి. శ్రీ రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ `ఎన్జీకే` రంజాన్ (జూన్ 4)ని పురస్కరించుకుని మే 31న విడుదల కానుండగా… కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న `కాప్పాన్` వినాయక చవితి (సెప్టెంబర్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 30న రిలీజ్ కానుందని సమాచారం. మరి… పండగల సమయంలో వస్తున్న సూర్య రెండు చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు పెర్‌ఫార్మ్ చేస్తాయో చూడాలి.
[youtube_video videoid=RfTNwFP6GeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: