ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవ, తమన్నా ప్రధాన పాత్రల్లో దేవి అనే తమిళ హార్రర్ సినిమా 2016 లో రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈసినిమా విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో అభినేత్రి టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు దేవి సినిమాకు సీక్వెల్ గా దేవి 2 సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తెలుగులో అభినేత్రి 2 టైటిల్ తో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కన్నడ ప్రదర్శన హక్కులకు సంబంధించిన లావాదేవీలు ఇంకా పూర్తికాకపోవడం వలన, విడుదలను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. మరి సక్సెస్ ఫుల్ హారర్ మూవీ సీక్వెల్ గా దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో ? లేదో? చూద్దాం..
[youtube_video videoid=_ML0-srkxNg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: