`సంభవామి యుగే యుగే`, `కళ్యాణం` వంటి చిత్రాల్లో నటించినా… `అందాల రాక్షసి`తో నటుడిగా మంచి మార్కులు సంపాదించాడు యువ కథానాయకుడు నవీన్ చంద్ర. ఆ తరువాత కొన్ని ఆసక్తికరమైన చిత్రాల్లో నటించినా ఆశించిన విజయాన్నైతే అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో `నేను లోకల్`, `దేవదాస్`, `అరవింద సమేత` వంటి చిత్రాల్లో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రల్లో అలరించాడు. ముఖ్యంగా `అరవింద సమేత` నవీన్‌కి నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ చిత్రంలోని పెర్‌ఫార్మెన్స్… ఓ తమిళ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశాన్ని అందించిందని కోలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం రూపొందుతోంది. ఇందులో విలన్‌గా నటించే అవకాశం నవీన్‌కి దక్కిందని సమాచారం. అంతేకాదు… ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ కానున్నాడట నవీన్. మరి ఇప్పటికే కొన్ని తమిళ సినిమాల్లో నటించిన నవీన్‌కి… ధనుష్ చిత్రం ఏ మాత్రం కెరీర్ ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా… నవీన్ నటించిన తాజా చిత్రాలు `28 డిగ్రీస్ సెల్సియస్`, `హీరో హీరోయిన్` విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
[youtube_video videoid=v-kAHihKv1M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: