గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాతో అయినా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం గత ఏడాదే పూర్తి చేసుకున్నా రిలీజ్ కు మాత్రం ఇంకా నోచుకోలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ వెనుక కూడా ఓ కారణం ఉందనుకోండి. ఇటీవలే ఈ సినిమాను సురేష్ బాబు మరియు అల్లు అరవింద్ కు చూపించగా ఇద్దరూ కొన్ని మార్పులు చెప్పారంటా. ఇక వారు చెప్పిన మార్పులను కంప్లీట్ చేసుకొని.. ఇప్పుడు రిలీజ్ కు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో అల్లు శిరీష్ సరసన ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు శిరీష్ తండ్రి పాత్రలో నాగబాబుగారు నటించగా… బాల నటుడు భరత్ ఈ చిత్రంలో శిరీష్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినట్టు తెలుస్తోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మధుర శ్రీధర్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు.
మరి మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా మంచి ఘన విజయం సాధించింది. మరి తెలుగు ప్రేక్షకులకు ఈసినిమా ఎంత వరకూ నచ్చుతుంది..? అల్లు శిరీష్ కు ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[youtube_video videoid=-fD0iKb4shc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: