
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 87


సెన్సార్ పూర్తి చేసుకున్న సూపర్ డీలక్స్

ఒకే రోజున రెండు ఆసక్తికరమైన చిత్రాలు

అప్పుడు `అరుంధతి`... ఇప్పుడు `సీత`

రవితేజ `వెంకీ`కి 15 ఏళ్ళు

ప్లే బాయ్ గా శర్వానంద్?

రెండు విభిన్న పాత్రల్లో ప్రభాస్?

పవన్ కళ్యాణ్ మీద విమర్శలపై కోన వెంకట్ వివరణ

ఎన్.జి.కె రిలీజ్ డేట్ ఫిక్స్

రానా కోసం 16 ఇంటర్నేషనల్ స్టూడియోస్

ప్రారంభమైన నాగార్జున మన్మథుడు 2

మహేష్ బాబు మైనపు ప్రతిమ ఆవిష్కరణ

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ అప్ డేట్

నాగార్జున, కార్తి `ఊపిరి`కి మూడేళ్ళు

కొత్త భాష నేర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్
తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బయోపిక్ లో ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ క్వీన్ కంగన అమ్మ పాత్రలో నటిస్తున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈసినిమాకు మణికర్ణికకు స్క్రిప్టు అందించిన విజయేంద్ర ప్రసాదే కథను అందించనున్నారట.

సెన్సార్ పూర్తి చేసుకున్న సూపర్ డీలక్స్
టి. కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా సూపర్ డీలక్స్. ఈ నెల 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనానే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకి 'ఏ' సర్టిఫికేట్ లభించింది.

ఒకే రోజున రెండు ఆసక్తికరమైన చిత్రాలు
ఈ వేసవిలో పలు ఆసక్తికరమైన చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ముఖ్యంగా... ప్రతీ వారం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతూ... ప్రేక్షకులకు వేసవి వినోదాన్ని అందివ్వనుంది. అయితే... మే 31న మాత్రం రెండు వైవిధ్యభరితమైన చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే `డియర్ కామ్రేడ్`, `ఎన్జీకే`.

అప్పుడు `అరుంధతి`... ఇప్పుడు `సీత`
2000లో విడుదలైన `హేండ్సప్` చిత్రంతో తెలుగునాట నటుడిగా కెరీర్‌ని ఆరంభించిన సోనూ సూద్‌కి... టర్నింగ్ పాయింట్లా నిలచిన చిత్రం మాత్రం `అరుంధతి` (2009) అనే చెప్పాలి. అనుష్క టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో పశుపతి పాత్రలో సోనూ సూద్ అభినయం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే... అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఇప్పటికీ సోనూ సూద్ పేరు చెబితే `అరుంధతి`తో తను చెప్పిన `వదల బొమ్మాళి వదలా` అనే డైలాగ్ ముందుగా గుర్తుకు వస్తుంది.

రవితేజ `వెంకీ`కి 15 ఏళ్ళు
`మాస్‌తో పెట్టుకుంటే మడతెడిపోద్ది`... అనే మేనరిజమ్‌తో మాస్ మహరాజ్ రవితేజ సందడి చేసిన చిత్రం `వెంకీ`. సోలో హీరోగా రవితేజ నటించిన తొలి చిత్రమైన `నీ కోసం` ద్వారా దర్శకుడిగా పరిచయమైన శ్రీను వైట్ల... సుదీర్ఘ విరామం తరువాత రవితేజని డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ సినిమాలో రవితేజకి జోడీగా స్నేహ నటించగా... ఇతర ముఖ్య పాత్రల్లో బ్రహ్మానందం, అశుతోష్ రాణా, శ్రీనివాస రెడ్డి, చిత్రం శ్రీను, ఏవీయస్, కృష్ణ భగవాన్ తదితరులు నటించారు. రాశి ప్రత్యేక గీతంలో సందడి చేసిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి…

ప్లే బాయ్ గా శర్వానంద్?
యువ కథానాయకుడు శర్వానంద్ ఈ ఏడాది రెండు ఆసక్తికరమైన చిత్రాలతో అభిమానులను పలకరించనున్నాడు. వాటిలో ఒకటి... సుధీర్ వర్మ రూపొందిస్తున్న చిత్రం కాగా... మరొకటి `96` రీమేక్. ఈ రెండు సినిమాలు కూడా తక్కువ గ్యాప్‌లోనే తెరపైకి రాబోతున్నాయి. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా మే నెలలో విడుదల కానుండగా... `96` రీమేక్ ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుందని సమాచారం.

రెండు విభిన్న పాత్రల్లో ప్రభాస్?
`మిర్చి`, `బాహుబలి - ది బిగినింగ్`, `బాహుబలి - ది కంక్లూజన్` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న `సాహో` ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఇక `జిల్` రాధాకృష్ణ రూపొందిస్తున్న పిరియాడికల్ లవ్ స్టోరీ వచ్చే ఏడాది ఆరంభంలో తెరపైకి రానుంది.

పవన్ కళ్యాణ్ మీద విమర్శలపై కోన వెంకట్ వివరణ
ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక నుండి ఓ లెక్క అన్నట్టు.. ఇప్పటి వరకూ టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యనే ఎన్నికల పోరు ఉండేది. కానీ ఇప్పుడు జనసేన మూడో శక్తిగా తెరపైకి వచ్చింది. జనసేన పార్టీ పెట్టి ఎంతో కాలం అవ్వట్లేదు కదా.. మాకు అంత పోటీ ఉండదులే అని మొదట టీడీపీ, వైసీపీ పార్టీలు అనుకున్నా... ఇప్పుడు అదే జనసేన పార్టీ చాపకింద నీరులా ప్రజల్లోకి వెళ్లి... ఏకు మేకులా తయారైంది. ఎంత జనసేన పార్టీ మాకు పోటీ కాదు పోటీ కాదు అని ఈ రెండు పార్టీలు అనుకుంటున్నా... రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోటీ…

ఎన్.జి.కె రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్.జి.కె (నంద గోపాలన్ కుమారన్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా టీజర్ ఇటీవలే రిలీజవ్వగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమాలో సూర్య చాలా వేరియన్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

రానా కోసం 16 ఇంటర్నేషనల్ స్టూడియోస్
గుణశేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ రానా ప్రధాన పాత్రలో ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే మరో చారిత్రాత్మక కథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే చాలా సెట్లు ఈ సినిమా కోసం నిర్మాణమైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరోసారి ఈసినిమా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు లైన్ క్లియర్.. సెన్సార్ పూర్తి
మొత్తానికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేయాలన్న వర్మ పంతం నెగ్గేలాగనే కనిపిస్తోంది. ఈసినిమా రిలీజ్ విషయంలో తలెత్తిన ఇబ్బందులు ఒకదాని తరువాత ఒకటి క్లియర్ అయిపోతున్నాయి. ఇటీవలే ఈ సినిమాపై ఈసీకు ఫిర్యాదు చేసిన క్రమంలో సినిమా చూసిన తరునాతే యాక్షన్ తీసుకునే రైట్ ఈసీకి ఉంటుందని ఈసీవో చెప్పడంతో ఆ ప్రాబ్లమ్ అయిపోయిందనుకున్నారు. ఆ తరువాత సెన్సార్ తో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ కూడా క్లియరైపోయింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ను ఇచ్చింది. దీంతో మార్చి 29 వ తేదీనే సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు…


చీకటి గదిలో చితక్కొట్టుడు, పులిజూదం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో ఆదిత్, నిక్కీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఈ సినిమా మార్చి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటు ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో విశాల్, మోహన్ లాల్ నటించిన పులిజూదం సినిమా కూడా అదే రోజు రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రెండు సినిమాల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

'ఖుషి - జల్సా'లను త్యజించి మట్టి చిప్పలో జొన్నకూడు తింటున్న “తమ్ముడు”
“ఏదీ తనంత తానై నీ దరికి రాదు.. సాధించి శోధించాలి.. అదియే ధీర గుణం" అన్న శ్రీశ్రీ పాటలోని కార్యసాధనా స్ఫూర్తి మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ లో నిండుగా కనిపిస్తుంది. ప్రజా బాహుళ్యంలో తనకు ఉన్న ఇమేజ్, గ్లామర్ లే తనను, తన జనసేన అభ్యర్థులను గెలిపిస్తాయి అనే ధీమాతో ఇంటి పట్టున కూర్చుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలక్షేపం చేయటం లేదు ఈ జనసేన అధిపతి.

ప్రారంభమైన నాగార్జున మన్మథుడు 2
నాగార్జున కెరీర్ లో మన్మథుడు సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచి..ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలోనే ఈసినిమాను ఈరోజు లాంచ్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మన్మథుడు 2 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీనియర్ రైటర్ సత్యానంద్.. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌కి స్క్రిప్ట్‌ని అందించగా, అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో…

మహేష్ బాబు మైనపు ప్రతిమ ఆవిష్కరణ
ఎట్టకేలకు మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. హైదరాబాద్ లోని ఏఎంబీ సిమానాస్ లో మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ సభ్యులు మహేష్ బాబు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో మహేష్ బాబు మైనపు ప్రతిమను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కలసి మహేష్ కుటుంబసభ్యులు ఫొటో దిగారు. ఇక ఈ కార్యక్రమానికి మహేష్ కుటుంబసభ్యులతో పాటు.. మహేష్ బాబు అభిమానులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాదు సాయంత్రం 6 గంటల వరకు విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఎంబీ సినిమాస్ మాల్ లో ఉంచుతారు. అభిమానులకు కూడా మైనపు ప్రతిమతో సెల్ఫీ తీసుకునే అవకాశం కల్పించారు. ఆ తరువాత సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్…

ఒక రోజు గ్యాప్‌లో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్
ఒకే వారంలో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ రిలీజ్ కావడం అరుదుగా జరుగుతుంది. అయితే... అలాంటి రేర్ ఫీట్ ఈ వారం టాలీవుడ్లో చోటుచేసుకోనుంది. కేవలం ఒక రోజు గ్యాప్‌లో అలా రెండు ఆసక్తికరమైన కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ఆ సినిమాలే... `ఐరా`, `సూర్యకాంతం`.

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ అప్ డేట్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే... గత కొద్దిరోజులుగా ఈసినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుండగా.. నిన్న రాత్రితో అక్కడ షూటింగ్ కూడా పూర్తయిందట. ఈ విషయాన్ని చార్మి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాదు.. ఈ సందర్భంగా అంతా కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసినట్టుగా... ఆ సందర్భంలో దిగిన ఒక సెల్ఫీని తన ట్విట్టర్లో షేర్ చేసింది.

ఎన్టీఆర్ లక్కీడేట్... `లక్ష్మీస్ ఎన్టీఆర్`కి ప్లస్ అవుతుందా?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`... ఎట్టకేలకు మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదల విషయంలో వాయిదాల పర్వం చోటుచేసుకున్నా... ఆసక్తికరంగా ఈ సినిమా మహానటుడు, మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు లక్కీ డేట్‌కే ల్యాండ్ అయ్యింది.

నాగార్జున, కార్తి `ఊపిరి`కి మూడేళ్ళు
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలచిన కథానాయకుల్లో కింగ్ నాగార్జున ఒకరు. అలా... నాగ్ నటించిన ప్రయోగాత్మక పాత్రల్లో... `ఊపిరి` చిత్రంలోని విక్రమాదిత్య పాత్ర ఒకటి. వీల్ ఛైర్‌కే పరిమితమైన ఈ పాత్రలో నాగార్జున చక్కగా ఒదిగిపోవడమే కాదు... ఆ పాత్రకు తగ్గ హావభావాలు పలికించి అలరించాడు. అలాగే... కేర్ టేకర్‌గా అతని జీవితంలోకి వచ్చి తదనంతరం స్నేహితుడై పోయే శీను పాత్రలో కార్తి కూడా పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన `ఊపిరి`ని ప్రసాద్ వి.పొట్లూరి నిర్మించగా... ఇతర ముఖ్య పాత్రల్లో తమన్నా, ప్రకాష్ రాజ్ నటించగా…