కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 131

Thammudu heavy action episode started in RFC
షూటింగ్ అప్‌డేట్

నితిన్ తమ్ముడు షూటింగ్ అప్డేట్

వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ,యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం తమ్ముడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.ఇందుకోసం ఏకంగా 8కోట్ల వరకు ఖర్చుపెడుతున్నారట. నితిన్ కెరీర్ లో ఓ ఫైట్ సీన్స్ కోసం ఇంతపెద్ద మొత్తం లో ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. ఈషెడ్యూల్ 10రోజులు జరుగనుంది.సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అవ్వనుందట.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna Interesting Update On Kubera Movie
షూటింగ్ అప్‌డేట్

కుబేర- రష్మిక కీలక షెడ్యూల్ కంప్లీట్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు మళ్లీ తెలుగులో పలు సినిమాలతో బిజీ అయిపోయింది. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం తను కూడా కుబేర షూటింగ్ లో పాల్గొంటుంది. ఈనేపథ్యంలో తాజాగా తన షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చింది. ఈసినిమాలోని ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలిపింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని…

TFN Adminవాట్సాప్
a sensational surprise coming from Pushpa 2
సినిమా వార్తలు

పుష్ప 2 నుండి మరో సర్ ప్రైజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 నుండి ఫస్ట్ సింగిల్ వచ్చే నెల 1 రానుందని తెలిసిందే.దాంతో అందరి చూపు ఆ సాంగ్ పైనే వుంది. నిన్న విడుదలచేసిన ఆ సాంగ్ ప్రోమో కూడా అంచనాలను పెంచేసింది.ఇక పుష్ప సాంగ్స్ నేషన్ వైడ్ గా ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.పుష్ప 2పై ఆ అంచనాలు డబుల్ అవుతాయి కాబట్టి అవుట్ ఫుట్ కూడా అలాగే ఇచ్చాడట రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.మరి ఫస్ట్ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.టీ సిరీస్ ఇంతకుముందు ఏ సినిమా ఇవ్వనంత ఎక్కువగా ఇచ్చి ఈ ఆడియో రైట్స్ ను దక్కించుకుందట.

TFN Adminవాట్సాప్
Telugu audience holds top positions among moviegoers in India
సినిమా వార్తలు

ఇండియా లోనే తెలుగు ఆడియన్స్ టాప్

మన ఇండియన్స్ కు ఉన్న ఎంటర్ టైన్ మెంట్స్ లో సినిమా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఫస్ట్ డే ఫస్ షోకి పక్కా వెళ్లాలి అనుకునే వాళ్లే చాలా మంది ఉంటారు. ఒకప్పుడు కొత్త సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద జాతరల ఉండేది. అయితే కరోనా వల్ల గడచిన మూడేళ్లలో థియేటర్ల ప్రభావం కాస్త తగ్గింది. దానికి తోడు ఓటీటీ లు కూడా ఎక్కువవ్వడం.. మరోవైపు టికెట్ రేట్లు పెరగడం.. ఇవన్నీ ఒకఎత్తైతే టికెట్ రేట్ల కంటే అక్కడ అమ్మే స్నాక్స్ రేట్లు ఆకాశాన్ని అంటటం..సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు అనే ఆలోచనకి కూడా చాలా మంది వచ్చేయడం.. కారణం ఏదైనా కానీ థియేటర్లకు వచ్చే జనం బాగా…

TFN Adminవాట్సాప్
Gangs Of Godavari Teaser Dubbing Update
ట్రైలర్ & టీజర్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ డబ్బింగ్ కంప్లీట్

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. గామి లాంటి హిట్ సినిమా తరువాత విశ్వక్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక రీసెంట్ గానే కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మే 17వతేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
hanuman movie worldwide premiere release date fixed
రిలీజ్ అప్‌డేట్

హనుమాన్ వరల్డ్ వైడ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగించింది.

TFN Adminవాట్సాప్
interesting update on nagarjuna role in dhanushs kubera movie
సినిమా వార్తలు

కుబేర -నాగార్జున రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

ధనుష్-నాగార్జున హీరోలుగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. జనవరిలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లగా ప్రస్తుతం అయితే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగార్జున రోల్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమాలో నాగార్జున ఒక స్టైలిష్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట. శేఖర్ కమ్ముల నాగార్జున పాత్రను చాలా కొత్తగా రాసినట్టు తెలుస్తుంది. ఇక ఈ వార్తతో నాగార్జున ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మరి శేఖర్ కమ్ముల నాగార్జునను ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
satyadev krishnamma movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

సత్యదేవ్ కృష్ణమ్మ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. మొదటినుండీ కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్టింగ్ చూపిస్తుండేవాడ సత్యదేవ్. ప్రస్తుతం సత్యదేవ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిజానికి ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈసినిమా ఆలస్యమవుతూ వస్తుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Aavesham joins the 100 crore Club
సినిమా వార్తలు

100కోట్ల క్లబ్ లో పుష్ప విలన్

మలయాళ స్టార్ ,పుష్ప లో విలన్ గా నటించిన ఫహద్ ఫాజిల్ ఆవేశం నిన్నటితో 100కోట్ల వసూళ్లను రాబట్టింది.రీసెంట్ గా విడుదలైన ఈసినిమా కేరళ లో సూపర్ రన్ ను కొనసాగిస్తోంది దాంతో 12రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.ఫహద్ ఫాజిల్ కు ఇదే మొదటి 100కోట్ల సినిమా.

Mahender Reddyవాట్సాప్
Kanulenduko melody song out from harom hara movie
సాంగ్

హరోం హర- కనులెందుకో కలిసేనులే మెలోడి సాంగ్ రిలీజ్

ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు సుధీర్ బాబు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మళ్లీ మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి మరొక పాటను రిలీజ్ చేశారు. కనులెందుకో కలిసేనులే కలలా ఇలా అంటూ వచ్చే ఈ మెలోడి సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు…

TFN Adminవాట్సాప్
BHIMAA streaming on Hotstar from today to night
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి రానున్న భీమా

మ్యాచో స్టార్ గోపిచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా ఈరోజు రాత్రి 12గంటలనుండి స్ట్రీమింగ్ లోకి రానుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈసినిమా ను తెలుగు తోపాటు తమిళ ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఇక మహాశివరాత్రిన థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పర్వాలేదనిపించింది. గోపిచంద్ నుండి వచ్చిన రీసెంట్ సినిమాల కన్నా భీమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసింది. అయితే గోపిచంద్ కు కావాల్సిన విజయాన్ని మాత్రం అందించలేకపోయింది.

Mahender Reddyవాట్సాప్
pushpa 2 movie first single release date fixed
రిలీజ్ అప్‌డేట్

పుష్ప2 ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అల్లు అర్జున్ నుండి రానున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇక ఈసినిమాతో అల్లు అర్జున్ రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంది పుష్ప 2 కోసం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
family star movie ott release date fixed
ఓటీటీ

ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కొన్ని కొన్ని సినిమాలకు వాటి కాంబినేషన్స్ బట్టే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. అయితే అది ఒక్కోసారి వర్కవుట్ అవుతుంది. ఒక్కోసారి వర్కవుట్ అవ్వదు. అలా ఈమధ్య భారీ అంచనాలతో రిలీజ్ అయి బోల్తా కొట్టిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Actor Samuthirakani Thanks To Audience as HanuMan Completes 100 Days
సినిమా వార్తలు

విభీషణుడి పాత్ర చేయాలంటే.. శ్రీరాముని అనుగ్రహం వుండాలి

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

Srikanth Mవాట్సాప్
love me release date fixed
రిలీజ్ అప్‌డేట్

లవ్ మీ రిలీజ్ డేట్ లాక్

రౌడీ బాయ్స్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి నుండి వస్తున్న మూడో సినిమా లవ్ మీ.దెయ్యంతో ప్రేమ అనే డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.ప్రముఖ టెక్నీషియన్లు పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం,కీరవాణి సంగీతం అందిసున్నారు.నిజానికిఈసినిమా ఈనెల 25న విడుదలకావాల్సి ఉండగా అనివార్యకారణాలవల్ల వాయిదా వేశారు.ఇక ఇప్పుడు న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.వచ్చే నెల 25న లవ్ మీ థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Teja Sajja Thanks To Audience as HanuMan Completes 100 Days
సినిమా వార్తలు

ఇది ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్ - తేజా సజ్జా

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

Srikanth Mవాట్సాప్
gangs of godavari teaser release date locked
ట్రైలర్ & టీజర్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వచ్చే నెలలో హైప్ వున్న సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే అది విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరే. ఇప్పుటికే రిలీజ్ అయిన రెండు పాటలు చార్ట్ బాస్టర్ కావడం దానికితోడు విశ్వక్ వరుస హిట్ల తో ఫుల్ ఫామ్ లో వుండడం తో ఈసినిమా పై మంచి అంచనాలు వున్నాయి.ఇక ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా టీజర్ ను ఈనెల 27నవిడుదలచేయనున్నారు.ఈ సందర్భంగా టీజర్ ఈవెంట్ ను జరుపనున్నారు.ఈ ఈవెంట్ శనివారం సాయంత్రం 04:01 గంటలకు ప్రారంభం కానుంది.సినిమాకు బజ్ పెరగాలంటే టీజర్ ను బాగా కట్ చేయాలి.మరి ఈటీజర్ అంచనాలను తగట్లు ఉంటుందో లేదో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
clarity on vijay deverakonda movie with prashanth neel
సినిమా వార్తలు

రౌడీ హీరో-ప్రశాంత్ నీల్ కాంబో పై క్లారిటీ

రౌడీహీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ కు ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే విజయ్ తన కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ తరువాత సినిమా వస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ స్పై గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. కాగా ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Director Prasanth Varma Says, I Will Spend Next 20 Years on PVCU
సినిమా వార్తలు

రానున్న ఇరవై ఏళ్ళు దీనిపై స్పెండ్ చేయబోతున్నా - ప్రశాంత్ వర్మ

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

Srikanth Mవాట్సాప్
surprising update from pushpa 2 movie first single promo
సినిమా వార్తలు

పుష్ప 2 ఫస్ట్ సింగిల్ సర్ ప్రైజింగ్ అప్ డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడోో తెలిసిందే కదా. దీనికి కారణం పుష్ప సినిమా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు బన్నీ. మరోవైపు ఈసినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్