
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 130


రీ రిలీజ్ కానున్న వకీల్ సాబ్

నెల్సన్ దిలీప్ కుమార్ డ్రీమ్ కాస్ట్

పుష్ప లో కేశవ ఫస్ట్ ఛాయిస్ సుహాస్

ప్రసన్న వదనం ట్రైలర్ రిలీజ్.. ఇరగదీసిన సుహాస్

సలార్2 లో కియారా అద్వాని పై క్లారిటీ

పరదా తొలగించిన అనుపమ పరమేశ్వరన్

ది 100 గ్రిప్పింగ్ టీజర్ రిలీజ్

కృష్ణమ్మ రిలీజ్ డేట్ లో మార్పు

హనుమాన్ టీమ్ కు గవర్నర్ సత్కారం

ఓదెల2 సెకండ్ షెడ్యూల్ మొదలు

పీరియాడిక్ డ్రామాపై సాయి ధరమ్ తేజ్ ఫోకస్

ముంబై లో మొదలైన కుబేర కొత్త షెడ్యూల్

గోట్ సెకండ్ సాంగ్ పై డైరెక్టర్ అప్ డేట్
దళపతి విజయ్ నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

ఆల్ టైం రికార్డ్ క్రీయేట్ చేసిన విజయ్ రీ రిలీజ్ సినిమా
రీ రీలీజ్ సినిమాల్లో దళపతి విజయ్ నటించిన గిల్లి అల్ టైం రికార్డు సృష్టించింది.ప్రస్తుతం కోలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏవి విడుదలలేకపోవడంతో రీసెంట్ గా రీ రిలీజైన గిల్లి సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈసినిమా నిన్నటి వరకు 20కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. మరి ఈరికార్డును ఏ రీ రీలీజ్ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

రీ రిలీజ్ కానున్న వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మళ్ళీ రిలీజ్ కానుంది.అజ్ఞాతవాసి తరువాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్, వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. 2021లో వచ్చిన ఈసినిమా 100కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.కరోనా వల్ల కొంచెం ఎఫెక్ట్ పడింది కానీ లేదంటే 200కోట్ల వసూళ్లను రాబట్టేదే.ఇక ఈసినిమాను మే 1న రీ రిలీజ్ చేస్తున్నారు.

నెల్సన్ దిలీప్ కుమార్ డ్రీమ్ కాస్ట్
ఎంత మంది హీరోయిలతో చేసినా కొంతమంది డైరెక్టర్లకు కూడా పలానా హీరోతే చేయాలనో.. పలానా హీరోయిన్ తో చేయాలనో అనుకుంటారు. తమ డ్రీమ్ ను నెరవేర్చుకుంటారు. ఇక ఇక్కడ ఓ డైరెక్టర్ కు కూడా డ్రీమ్ కాస్టింగ్ ఉంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. తమిళ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. గత ఏడాది రజనీకాంత్ తో జైలర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు నెల్సన్.

పుష్ప లో కేశవ ఫస్ట్ ఛాయిస్ సుహాస్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో కూడా చూశాం. బన్నీ నటన, యాక్షన్, సుకుమార్ స్క్రీన్ ప్లే, దేవి మ్యూజిక్ ఇంకా అన్ని అంశాలు కలిసొచ్చి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఇక ఈసినిమాలో కేశవ పాత్ర కూడా ఈసినిమాకు ఎంత కలిసొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కథను మొదటి నుండి చివరకి వరకూ చెప్పడమే కాకుండా, అల్లు అర్జున్ పక్కనే ఉంటూ తన యాసతో, తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

ప్రసన్న వదనం ట్రైలర్ రిలీజ్.. ఇరగదీసిన సుహాస్
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తన ప్రతిభతో క్యారక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నవారిలో సుహాస్ ఒకడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఒకవైపు కమెడియన్‌గా, విలన్‌గా నటిస్తూనే.. తొలిసారిగా 'కలర్ ఫోటో' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుసగా.. 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుకున్నాడు.

సలార్2 లో కియారా అద్వాని పై క్లారిటీ
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు శౌర్యాంగ పర్వంగా సలార్ 2 రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

పరదా తొలగించిన అనుపమ పరమేశ్వరన్
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో అప్పుడే ఆమె తాన్ తదుపరి చిత్రాన్ని కూడా ప్రారంభించేసింది. ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మరో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే సీనియర్ నటి సంగీత కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి మరియు శ్రీధర్ మక్కువతో కలిసి నిర్మాత విజయ్ డొంకాడ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ది 100 గ్రిప్పింగ్ టీజర్ రిలీజ్
రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో మొగలి రేకులు ఫేమ్ ఆర్‌కె సాగర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ 'ది 100'. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇదిలా ఉండగా ఇటీవల భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించింది. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను మెగా మదర్ శ్రీమతి కొణిదెల అంజనా దేవి లాంచ్ చేశారు.

కృష్ణమ్మ రిలీజ్ డేట్ లో మార్పు
విభిన్నమైన కథలతో అలరించడంలో సత్యదేవ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

ఈవారం ఓటీటీలోకి క్రేజీ సినిమాలు
ఇప్పుడు ఓటీటీ హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం కదా. థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ ఓటీటీ హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి వారం ఓటీటీలో సందడి చేయడానికి చాలా సినిమాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇక ఈవారం కూడా పలు పైగా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

హనుమాన్ టీమ్ కు గవర్నర్ సత్కారం
హనుమాన్ సినిమాకు మాత్రం ఇప్పటికీ ఏదో ఒకరకంగా గౌరవమర్యాదలు దక్కుతూనే ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జాహీరోగా వచ్చిన ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చిన్నసినిమాగా వచ్చిన ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా రిలీజ్ అయి రీసెంట్ గానే 100రోజులు పూర్తి చేసుకుంది. ఈ వందరోజుల్లో ఈసినిమా ఎన్నో అవార్డులను, రివార్డులను, సత్కారాలను అదుకుంది ఈసినిమా.

డియర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన సినిమా డియర్. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా గురక కాన్సెప్ట్ తో వచ్చింది ఈసినిమా. ఈసినిమా ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది.

ఓదెల2 సెకండ్ షెడ్యూల్ మొదలు
అశోక్ తేజ్ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఓదెల2. ఈసినిమా ఓదెల రైల్వేస్టేషన్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2022 లో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమా మంచి ప్రశంసలే దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా ఓదెల2 సినిమా వస్తుండటంతో దీనిపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

ఓటీటీలోకి వచ్చేసిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ అప్ డేట్
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి వచ్చిన సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. ఈసినిమా మార్చి 18వ తేదీన రిలీజ్ అయి సూపర్ హిట్ ను సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిజ్ కలెక్షన్స్ ను అందించింది. కేవలం 25రోజుల్లో ఈసినిమా 150 కోట్లను కలెక్ట్ చేసింది. అంతేకాదు మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో కూడా చోటు దక్కించుకుంది.

పీరియాడిక్ డ్రామాపై సాయి ధరమ్ తేజ్ ఫోకస్
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఈమధ్య కాస్త విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరోో సినిమాతో రాబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాంజా శంకర్. అయితే ఈసినిమా టైటిల్ విషయంలో పలు వివాదాలు వచ్చాయి. సినిమా టైటిల్ మార్చాలన్న వాదనలు వినిపించాయి. ప్రస్తుతం అయితే సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.

ముంబై లో మొదలైన కుబేర కొత్త షెడ్యూల్
ప్రస్తుతం తెలుగులో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్-నాగార్జన కాంబినేషన్ లో వస్తున్న కుబేర. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ అయితే ట్రెమెండెస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

సత్యభామ నుండి 'కళ్ళారా చూశాలే' లిరికల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చాలాకాలం గ్యాప్ తర్వాత గతేడాది 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో జోడీకట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం 'సత్యభామ' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.