
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 132


అఖండ2 సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే?

NBK109 షూట్ లో జాయిన్ అయిన హంటర్

ఐమ్యాక్స్ 3డీ వర్షన్ లో జై హనుమాన్

సుడిగాడు 2 కథ రాస్తున్నా-అల్లరి నరేష్

గ్రాండ్‌గా ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త చిత్రం

దేశరాజధానిలో థగ్ లైఫ్ కొత్త షెడ్యూల్

విశ్వంభర ఒక్క యాక్షన్ సీక్వెన్స్-26 రోజులు

ప్రభాస్ గొప్ప మనసు.. టీఎఫ్‌డీఏకు భారీ విరాళం

తలైవా 171 టైటిల్ రిలీజ్

అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ రిలీజ్

కాజల్ అగర్వాల్ సత్యభామ రిలీజ్ డేట్ ఫిక్స్

100 రోజులు పూర్తి చేసుకున్న హనుమాన్

మళ్లీ షూటింగ్ షురూ చేసిన మనోజ్

ప్రతినిధి 2 రిలీజ్ డేట్ వాయిదా
బాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత పలు సినిమాలతో అలరించాడు నారా రోహిత్. అయితే చాలా కాలం తను సినిమాలకు దూరంగా ఉండగా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత నారా రోహిత్ నుండి వస్తున్న సినిమా ప్రతినిధి2. ఈసినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలను కూడా రిలీజ్ చేసుకుంది. అన్ని అప్ డేట్లు కూడా సినిమాపై మంచి క్యూరియాసిటినీ పెంచాయి.

అఖండ2 సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే?
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ కాంబినేషన్ మరేదో కాదు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇంకా బాలకృష్ణ ది. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషనే మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహా, లెజెండ్, అఖండ ఇలా మూడు సినిమాలు రాగా మూడు సినిమాలు కూడా ఒకదానిని మించి విజయాన్ని అందించాయి.

NBK109 షూట్ లో జాయిన్ అయిన హంటర్
నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఐమ్యాక్స్ 3డీ వర్షన్ లో జై హనుమాన్
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో పెద్ద సంచలనం సృష్టించిన సినిమా హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక రిలీజ్ అయి ఈసినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేసిందో చూశాం. కలెక్షన్స్ కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. దీంతో చిత్రయూనిట్ 100 రోజుల సెలబ్రేషన్స్ కూడా చేసుకోనున్నారు.

సుడిగాడు 2 కథ రాస్తున్నా-అల్లరి నరేష్
అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్నాడు అల్లరి నరేష్. ఆ తరువాత కామెడీ సినిమాతోనే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈమధ్య నాంది, ఉగ్రం లాంటి సీరియస్ కథలతో మెప్పించి ఇప్పుడు మళ్ళీ కామెడీ సినిమాతో వస్తున్నారు. మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ ఒక్కటీ అడక్కు అనేే టైటిల్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. మే 3వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ పనులతో బిజీగా ఉంది.

గ్రాండ్‌గా ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త చిత్రం
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా మరో కొత్త సినిమాను పట్టాలెక్కించేశారు. కాగా ఇది సందీప్ కిషన్‌కు ల్యాండ్‌మార్క్ (30వ) చిత్రం కావడం విశేషం. వర్కింగ్ టైటిల్ #SK30గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు 'ధమాకా' ఫేమ్ త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్
దేశవ్యాప్తంగా మంగళవారం (ఏప్రిల్ 23, 2024) హనుమంతుడి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంజనీ పుత్రుడి ఆశీస్సులు అందుకునేందుకు భక్త జనం ఆలయాలకు బారులుతీరుతున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు, భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

దేశరాజధానిలో థగ్ లైఫ్ కొత్త షెడ్యూల్
లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. థగ్ లైఫ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.

విశ్వంభర ఒక్క యాక్షన్ సీక్వెన్స్-26 రోజులు
మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

ప్రభాస్ గొప్ప మనసు.. టీఎఫ్‌డీఏకు భారీ విరాళం
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఏదయినా ఆపత్కాలంలో బాధితులకు సాయమందించేందుకు ఆయన ఎల్లప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ మేరకు ఆయన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌డీఏ)కు భారీ విరాళం అందించారు.

ప్రసన్నవదనం.. మైత్రీ చేతికి తెలంగాణ, తమిళనాడు రిలీజ్ రైట్స్
టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తన ప్రతిభతో క్యారక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరో స్టార్డమ్ సొంతం చేసుకున్నవారు అతి తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో సుహాస్ ఒకడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఒకవైపు కమెడియన్‌గా, విలన్‌గా నటిస్తూనే.. తొలిసారిగా 'కలర్ ఫోటో' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుసగా.. 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుకున్నాడు.

తలైవా 171 టైటిల్ రిలీజ్
తలైవా రజనీకాంత్ ఈ వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టైయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా మంజు వారియర్, రితికా సింగ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ ఇంకా రానా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ రిలీజ్
కామెడీ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఈమధ్య కాస్త రూట్ మార్చి సీరియస్ సినిమాలు తీసినా ఇప్పుడు మళ్లీ తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్ లోకి వచ్చేశాడు. మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఆడు జీవితం- 25 రోజుల్లో 150 కోట్లు
మలయాళం సినిమాలు కూడా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. దానికి కారణం డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు రావడమే అందుకు కారణం. ఇక రీసెంట్ గా మరో సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. ఆ సినిమా మరేదో కాదు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన ఆడు జీవితం సినిమా. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమా వచ్చింది. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ.

కాజల్ అగర్వాల్ సత్యభామ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చాలాకాలం గ్యాప్ తర్వాత గతేడాది 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో జోడీకట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం 'సత్యభామ' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.

సప్త సాగరాలు దాటి సైడ్-బి.. ఓటీటీలోకి వచ్చేసిన హిందీ వెర్షన్
ఈమధ్య కన్నడ సినిమాలు కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే ఈమధ్య కన్నడ సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈనేపథ్యంలో గత ఏడాది రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకున్న సినిమా సప్త సాగరాలు దాటి పార్ట్ 1 అండ్ పార్ట్2. కన్నడలో సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడా కూడా సూపర్ హిట్ అయ్యాయి.

100 రోజులు పూర్తి చేసుకున్న హనుమాన్
టాలీవుడ్ యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విజువల్ వండర్ 'హనుమాన్'. యువ నటుడు తేజ సజ్జా హీరోగా నటించగా శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు.

మళ్లీ షూటింగ్ షురూ చేసిన మనోజ్
మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాను ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.

గీతాంజలి మళ్ళీ వచ్చింది.. 11 డేస్ కలెక్షన్స్
తెలుగు అమ్మాయి అంజలి టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. 2014లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. 'ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి' అంటూ వస్తోన్న ఈ మూవీ అంజలి నటించిన 50వ సినిమా కావడం విశేషం. 'నిన్ను కోరి', 'నిశ్శబ్దం' చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు.

కల్కి 2898 ఏడీ.. సర్ప్రైజింగ్ రోల్లో అమితాబ్ బచ్చన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రానటువంటి కథతో ఇది రూపొందుతోందని మేకర్స్ ఇదివరకే స్పష్టం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన సమాచారం కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.