కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 67

bedurulanka 2012 latest collections
బాక్సాఫీస్

బెదురులంక 3డేస్ కలెక్షన్స్

ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012 కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి.మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం తో మొదటి రోజు1.7కోట్ల డీసెంట్ వసూళ్లను రాబట్టింది.ఆతరువాతి రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టింది.ఇక నిన్న... మొదటి రెండు రోజులకన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 7కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఇందులో షేర్ 4కోట్లు.మరో కోటి రూపాయలు వసూలు చేస్తే చాలు బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.ఈరెండు రోజుల్లో ఆ మార్క్ ను క్రాస్ చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Balakrishna's Bhairava Dweepam Ready For Re-release on August 30
రిలీజ్ అప్‌డేట్

రీ రిలీజ్‌కు సిద్ధమైన బాలకృష్ణ 'భైరవ ద్వీపం'

టాలీవుడ్‌లో రీసెంట్‌గా రీ రిలీజ్‌ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన అగ్ర హీరోల సినిమాలను మళ్ళీ విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ ‘భైరవ ద్వీపం’ సినిమా చేరింది. కాగా 1974లో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ.. సినీ పరిశ్రమలో 50 గ్లోరియస్ ఇయర్స్ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈ తరం ప్రేక్షకులను అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి 'భైరవ ద్వీపం' సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. ‘భైరవద్వీపం’ చిత్రాన్ని దాదాపు రెండు దశాబ్దాల…

Srikanth Mవాట్సాప్
nithiin new movie title revealed
సినిమా వార్తలు

తమ్ముడు టైటిల్ తో నితిన్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్ట్ మూవీస్ టైటిల్స్ ను వాడుకునే పనిలో వున్నారు టాలీవుడ్ యంగ్ హీరోస్.పవన్ కెరీర్ లో తొలిప్రేమ,తమ్ముడు,ఖుషి ఈ మూడు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఇందులో ఇప్పటికే వరుణ్ తేజ్ తొలిప్రేమ టైటిల్ తీసుకొని హిట్ కొట్టాడు.ఇక మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఖుషి తో వచ్చేందుకు సిద్దమవుతున్నాడు.శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్,సమంత కలిసి నటించారు.ఈసినిమా వచ్చే నెల 1న విడుదలవుతుంది.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Balakrishna's Son Mokshagna Visits Bhagavanth Kesari Sets
సినిమా వార్తలు

భగవంత్ కేసరి సెట్‌లో సందడి చేసిన నందమూరి మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకూ ఆయన ఎంట్రీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం చేయొచ్చనే టాక్ నడుస్తోంది. దీనికితోడు ఈ మధ్య మోక్షజ్ఞ తండ్రి సినిమాల షూటింగ్స్ మరియు సెట్స్‌ను తరచుగా సందర్శిస్తున్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. ఇక బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో…

Srikanth Mవాట్సాప్
Director Buchi Babu Offers Special Pooja at New Office Building For RC16
సినిమా వార్తలు

ఆర్‌సీ16 కోసం కొత్త ఆఫీస్‌ ప్రారంభించిన మూవీ టీమ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ 'ఆర్‌సీ16'గా పరిగణిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు 'ఆర్‌సీ16'కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని బీఎన్‌ఆర్‌ హిల్స్‌లో ప్రత్యేకంగా ఒక కొత్త ఆఫీస్‌ని…

Srikanth Mవాట్సాప్
skanda trailer gets sensational response
ట్రైలర్ & టీజర్

స్కంద ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

వారియర్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన చిత్రం స్కంద.మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.ఇక ఈసినిమా నుండి మొన్న విడుదలైన ట్రైలర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాకు భారీ హైప్ క్రీయేట్ చేసింది.ఇప్పటివరకు స్కంద తెలుగు వెర్షన్ ట్రైలర్ 24మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టింది.బోయపాటి మార్క్ యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ లో రామ్ లుక్,ఫైట్స్ హైలైట్ అయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
og teaser out soon
ట్రైలర్ & టీజర్

ఓజి నుండి అదిరిపోయే అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది.ఇందులో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.సినిమా ప్రారంభమైనప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోగా ఇటీవలే బ్రేక్ ఇచ్చారు.త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా నుండి పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే.అయితే అంత కన్నా ముందు ఫస్ట్ లుక్ కూడా విడుదలకానుందని వార్తలు వచ్చాయి.ఇక టీజర్,ఫస్ట్ లుక్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్ .

Mahender Reddyవాట్సాప్
Ram Pothineni Interesting Comments on Skanda Director Boyapati Srinu
సాంగ్

ఏదైనా మొండిగా నమ్మేసి ముందుకెళ్లిపోవడం బోయపాటి నైజం - రామ్‌ పోతినేని

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉస్తాద్ రామ్‌ పోతినేని. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ‘స్కంద-ది అటాకర్‌’. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో చిత్రం ప్రీరిలీజ్‌ థండర్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రామ్‌ పోతినేని మాట్లాడుతూ.. "బోయపాటి శ్రీను ఏదైనా సరే మొండిగా నమ్మేసి ముందుకెళ్లిపోతారు. ట్రైలర్‌లో కనిపించిన నా మాస్‌ లుక్‌ను ఆయన ఏడు గంటల పాటు దగ్గరుండి మరీ రెడీ చేయించుకున్నారు. ఈ సినిమాలో బోయపాటి నన్ను ఇప్పటివరకూ ఎవరూ చూపని కొత్త పంథాలో చూపించారు. నా కెరీర్‌లో 'స్కంద' గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది. మా కాంబినేషన్‌లో సినిమా చేయాలనుందని…

Srikanth Mవాట్సాప్
Balakrishna Interesting Comments on Ram Pothineni at Skanda Pre Release Thunder Event
సినిమా వార్తలు

ఇస్మార్ట్‌ శంకర్‌తో రామ్‌ నాకొక సవాల్‌ విసిరాడు - నందమూరి బాలకృష్ణ

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో రామ్‌ తనకు ఒక సవాల్‌ విసిరాడని, దానిని తాను అందుకోవాల్సి ఉందని పేర్కొన్నారు టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ. శనివారం ఆయన హైదరాబాద్‌లో జరిగిన ‘స్కంద-ది అటాకర్‌’ ప్రీరిలీజ్‌ థండర్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా ఉస్తాద్ రామ్‌ పోతినేని కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘స్కంద’ ప్రీరిలీజ్ ఈవెంట్‌‌లో పాల్గొన్న బాలకృష్ణ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. అలాగే ఇటీవలి ‘చంద్రయాన్‌ 3’ విజయంపై ఓ ప్రత్యేక గ్లింప్స్‌ విడుదల చేసి ఇస్రో టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఇక కార్యక్రమంలో భాగంగా హీరో రామ్…

Srikanth Mవాట్సాప్
skanda trailer out now
ట్రైలర్ & టీజర్

స్కంద ట్రైలర్ రిలీజ్

రామ్ పోతినేని,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కంద.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే సాంగ్స్ కు సూపర్ హైప్ వచ్చింది.ఇక ఈరోజు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్ప కళా వేదిక లో జరిగింది.ఈవేడుక కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Sunny Deol's Gadar 2 Becomes The First Film to be Screened at New Parliament Building
సినిమా వార్తలు

పార్లమెంటులో ప్రదర్శించబడిన తొలి చిత్రంగా గదర్ 2 సరికొత్త చరిత్ర

బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన యాక్షన్ డ్రామా చిత్రం గదర్ 2 బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తోంది. ఆగస్ట్ 11న రిలీజై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ సినిమాలో సన్నీ డియోల్ సరసన అమీషా పటేల్ కథానాయికగా నటించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను కొత్త పార్లమెంట్ భవనంలో ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం (ఆగస్ట్ 25, 2023) నుంచి మూడు రోజుల పాటు ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సాగనుంది. దీనికోసం లోక్‌సభ సభ్యుల కోసం న్యూ ఢిల్లీలోని న్యూ పార్లమెంట్ హౌస్‌లో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను చిత్ర నిర్మాతలు ఏర్పాటుచేశారు. గదర్ 2…

Srikanth Mవాట్సాప్
kushi fifth single out now
సాంగ్

ఖుషి నుండి 5వ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి మరో 6 రోజుల్లో థియేటర్లోకి రానుంది.ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అవ్వడం అలాగే ట్రైలర్ ప్రామిసింగ్ గా వుండడడంతో సినిమాఫై అంచనాలు పెరిగిపోయాయి.ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ హైప్ తగ్గట్లే జరిగింది.లైగర్,విజయ్ మార్కెట్ ను ఏ విధంగా ప్రభావితం చేయలేకపోయింది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
Devi Sri Prasad Takes Blessings From Music Maestro Ilayaraja
సినిమా వార్తలు

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్న దేవిశ్రీ ప్రసాద్

భారతీయ సినీ చరిత్రలో మ్యూజిక్ మ్యాస్ట్రోగా పేరొందిన లెజెండ్ ఇళయరాజాకు పాదాభివందనం చేశారు సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. ఈ మేరకు శనివారం ఇళయరాజా ఇంటికి వెళ్లిన ఆయన సంగీతంలో త‌న‌కు గురువైన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్నాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈ పురస్కారాలు గెలుచుకున్న వారిలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో తాను అందించిన సంగీతానికి గానూ దేవిశ్రీ నేష‌న‌ల్ అవార్డు అందుకున్నారు.

Srikanth Mవాట్సాప్
bedurulanka 2012 day 1 collections
బాక్సాఫీస్

బెదురులంక 2012 డే 1 కలెక్షన్స్

యంగ్ హీరో కార్తికేయ,నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012.2012 లోయుగాంతం అనే రూమర్స్ ను బేస్ చేసుకొని తెరకెక్కింది.ఇక నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా తొలిరోజు 1.70కోట్ల గ్రాస్ ను రాబట్టింది.మరో మూడు కోట్లు రాబడితే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.ఈరెండు రోజుల్లో ఆ మార్క్ ను క్రాస్ చేసేలానే వుంది.మౌత్ టాక్ బాగుండడంతో తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
Ustaad Ram Pothineni's Skanda Pre-release Thunder Set to Strike Today
సాంగ్

నేడే రామ్ పోతినేని, బోయపాటి స్కంద ప్రీ రిలీజ్ థండర్‌

రామ్‌ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్కంద'. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుస్తోంది. అవుట్‌ ఆండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై సినీ లవర్స్‌తో పాటు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఇటీవలే రిలీజైన మూవీ గ్లింప్స్‌, సాంగ్స్ కి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా సాంగ్స్ లో రామ్‌ పోతినేని, శ్రీలీల డాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ క్రేజీ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషన్‌ క్యాంపెయిన్‌ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో…

Srikanth Mవాట్సాప్
Director Buchi Babu Shares Interesting Update About RC16 Movie
సినిమా వార్తలు

రామ్ చరణ్ ఆర్‌సీ16పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చి బాబు

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా 'ఉప్పెన' సినిమా అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్‌ బుచ్చి బాబు సానాకు ఇదే తొలిచిత్రం కావడం గమనార్హం. దీంతో మొదటి సినిమాకే జాతీయ అవార్డు అందుకొని బుచ్చి బాబు ప్రస్తుతం టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ఈ సందర్భంగా బుచ్చి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో 'ఉప్పెన' సినిమాకు అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన ఆయన తొలి సినిమాతోనే గొప్ప లక్ష్యాన్ని అందుకున్నానని తెలిపారు. ఈ విజయంతో ఒక దర్శకుడిగా తనపై బాధ్యత మరింత పెరిగిందని, ఇకపై తాను చేయబోయే సినిమాల విషయంలో అప్రమత్తంగా…

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth's Jailer Movie Crosses Rs.525 Cr Gross
బాక్సాఫీస్

రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోన్న రజినీకాంత్‌ ‘జైలర్‌’ మూవీ

సూపర్ స్టార్ రజినీకాంత్‌ తాజా చిత్రం 'జైలర్' రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచి దూసుకెళ్తోన్న ఈ సినిమా స్పీడ్ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ‘జైలర్‌’ మూవీ రూ. 525 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ మేరకు తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ఈ సినిమా కేవలం 15 రోజుల్లో 525 కోట్ల గ్రాస్ మార్క్‌ని క్రాస్ చేయడం విశేషం. ఈ చిత్రం మొదటి వారాంతంలో రూ. 400 కోట్లు, రెండో వారంలో రూ. 120 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఇప్పటి వరకు తెలుగులో ఈ సినిమా రూ.45 కోట్లకు పైగా షేర్‌ను రూ.80 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్లు సమాచారం.

Srikanth Mవాట్సాప్
Allu Arjun & Sukumar Gets Emotional After Wins National Award For Pushpa
సినిమా వార్తలు

నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ఆనందంలో.. అల్లు అర్జున్‌, సుకుమార్ ఎమోషన్

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐకాస్ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్‌ గెలుచుకొన్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జాతీయ ఉత్తమ నటుడిగా తెలుగువారెవరికీ చోటు దక్కలేదన్న బాధను తీర్చేశారు. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన సందర్భంగా.. బెస్ట్ నేషనల్ యాక్టర్‌ విజేతగా అల్లు అర్జున్ పేరు వెలువడిన వెంటనే టాలీవుడ్ లో సంబరాలు అంబరాన్నంటాయి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో…

Srikanth Mవాట్సాప్
Pawan Kalyan and Sai Dharam Tej's BRO Movie Streaming on Netflix
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న 'బ్రో' మూవీ

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మరియు సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ జీ స్టూడియోస్‌ భాగస్వామ్యంతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. జులై 28న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయిన ‘బ్రో’ సినిమా పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించింది. విడుదలైన తొలిరోజే రూ.30 కోట్ల షేర్‌ను కొల్లగొట్టడంతో పాటు తర్వాతి రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమాలో ‘టైమ్ ఆఫ్ గాడ్‍’ పాత్రలో పవన్ కల్యాణ్‌ చేసిన మ్యాజిక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. మనిషి జీవితంలో కాలం…

Srikanth Mవాట్సాప్
69th National Film Awards: Tollywood Shines Bright with RRR and Pushpa
సినిమా వార్తలు

69వ జాతీయ సినిమా అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఈ చలనచిత్ర పురస్కారాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడగా.. 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఇక ఈ జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సత్తా చాటింది. మునుపెన్నడూ లేనిస్థాయిలో పలు విభాగాల్లో అనేక అవార్డులను కొల్లగొట్టింది. వివిధ విభాగాల్లో 10 జాతీయ అవార్డులు దక్కించుకుని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచింది తెలుగు సినిమా.

Srikanth Mవాట్సాప్

షేర్