విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి మరో 6 రోజుల్లో థియేటర్లోకి రానుంది.ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అవ్వడం అలాగే ట్రైలర్ ప్రామిసింగ్ గా వుండడడంతో సినిమాఫై అంచనాలు పెరిగిపోయాయి.ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ హైప్ తగ్గట్లే జరిగింది.లైగర్,విజయ్ మార్కెట్ ను ఏ విధంగా ప్రభావితం చేయలేకపోయింది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి కొద్దీ సేపటి క్రితం 5వ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఓసి పెళ్ళామా అంటూ సాగే ఈసాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్ మరియు సాకేత్ పాడగా డైరెక్టర్ శివ నిర్వాణ రచించారు.ఈసినిమాలో అన్ని సాంగ్స్ కూడా ఆయనే రాయడం గమనార్హం.ఈ సాంగ్ కూడా క్యాచీ గా వుంది.
యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రంలో సమంత హీరోయిన్ గా నటించగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.తెలుగు తోపాటు హిందీ మలయాళ,కన్నడ,తమిళ భాషల్లో విడుదలకానుంది.లైగర్ తరువాత విజయ్ కి ఇది వరుసగా రెండో పాన్ ఇండియా రిలీజ్.మరి ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: