పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది.ఇందులో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.సినిమా ప్రారంభమైనప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోగా ఇటీవలే బ్రేక్ ఇచ్చారు.త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా నుండి పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే.అయితే అంత కన్నా ముందు ఫస్ట్ లుక్ కూడా విడుదలకానుందని వార్తలు వచ్చాయి.ఇక టీజర్,ఫస్ట్ లుక్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్ .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ లుక్ ఉండదు డైరెక్ట్ గా టీజర్ వస్తుందని హంగ్రీ ఛీతా పేరుతో ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నామని ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు.వచ్చే నెల 2న ఈ టీజర్ విడుదలకానుంది.దాంతో ఈటీజర్ యూ ట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్,ఇమ్రాన్ హష్మీ,శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ప్రారంభంలో ఓజీ ను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
NO FIRST LOOK… Wanted to give an adrenaline rush with the visuals and BGM. 💥G.
Let’s await for THE #HUNGRYCHEETAH ON SEPTEMBER 2nd. Get your screens and woofers ready. 🔥🔥 #TheyCallHimOG pic.twitter.com/7PimBs3s1N
— DVV Entertainment (@DVVMovies) August 28, 2023
ఇదిలావుంటే పవన్ ప్రస్తుతం ఈ సినిమా తోపాటు హరి హర వీరమల్లు ,ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా నటిస్తున్నాడు.హరి హరవీర మల్లును క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: