
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 66


పవన్ బర్త్ డే రోజు రానున్న సప్రైజ్ లు ఇవే

సైంధవ్ లో తమిళ హీరో

ఫ్యామిలీ మ్యాన్ మిస్ చేసుకున్న చిరంజీవి ?

మా ఊరి పొలిమేర-2 విడుదల తేదీ ఖరారు

నందమూరి బాలకృష్ణ నటజీవితానికి 49 ఏళ్ళు పూర్తి

అల్లు అర్జున్ తో ఇంస్టాగ్రామ్ టీం స్పెషల్ వీడియో

గుంటూరు కారం షూటింగ్ అప్డేట్

ధనుష్ సినిమాలో నాగార్జున

రూ. 600 కోట్ల క్లబ్‌లో రజనీకాంత్ 'జైలర్' మూవీ

కేరళ ప్రజలకు మోహన్ లాల్ ఓనమ్ శుభాకాంక్షలు

నాగార్జున నా సామి రంగ గ్లింప్స్ రిలీజ్

జవాన్ ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను విడుదలచేశారు.ఇక ఈ ట్రైలర్ చూస్తే జవాన్,షారుఖ్ కు మరో హిట్ ఇచ్చేలానే ఉంది.ముఖ్యంగా విజువల్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.ఈసినిమాలో షారుఖ్ డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు.

పవన్ బర్త్ డే రోజు రానున్న సప్రైజ్ లు ఇవే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన పుట్టిన రోజును జరుపుకోనున్నాడు.ఈసందర్భంగా తను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుండి సప్రైజ్ లు ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.అందులో భాగంగా ఓజీ నుండి అదే రోజు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈవిషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటెర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.ఈరోజు సాయంత్రం రిలీజ్ టైం కూడా చెప్పనున్నారు. ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సైంధవ్ లో తమిళ హీరో
ఎఫ్ 3 తరువాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సైంధవ్. ఇది ఆయనకు 75వ సినిమా కావడం విశేషం.హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాలో తమిళ హీరో ఆర్య ఓ కీలక మైన పాత్రలో మానస్ అనే పేరు తో కనిపించనున్నాడు.కొద్దిసేపటి క్రితం ఆర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో లాంగ్ హెయిర్ తో చేతిలో గన్ పట్టుకొని కనిపించాడు ఆర్య.ఈ ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.

ఫ్యామిలీ మ్యాన్ మిస్ చేసుకున్న చిరంజీవి ?
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.2019 సెప్టెంబర్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సెన్సేషన్ సృష్టించింది.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కొన్ని నెలలపాటు ట్రెండింగ్ లో కొనసాగింది.మొదటి సీజన్ బ్లాక్ బాస్టర్ కావడంతో రెండో సీజన్ కూడా వచ్చింది.ఈసీజన్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేసింది.ఈసిరీస్ ను రాజ్ &డీకే డైరెక్ట్ చేయగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ లీడ్ రోల్ లో నటించాడు.

స్కంద నుండి సాంగ్ రిలీజ్
ఉస్తాద్ రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కంద.3 రోజుల క్రితం విడుదలైన ఈసినిమా ట్రైలర్ సెన్సేషనల్ వ్యూస్ ను రాబట్టుకొని సినిమా కు భారీ హైప్ తెచ్చింది. ఇక ఈసినిమానుండి ఇప్పటివరకు రెండు సాంగ్స్ విడుదలకాగా రెండు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఇప్పుడు మూడో సాంగ్ కూడా విడుదలైయింది.డుమ్మారే డుమ్మా అంటూ సాగే ఈసాంగ్ ను కళ్యాణ్ చక్రవర్తి రచించగా అర్మాన్ మాలిక్ ,అయాన్ ప్రణతి పాడారు.

మా ఊరి పొలిమేర-2 విడుదల తేదీ ఖరారు
శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం "మా ఊరి పొలిమేర-2'. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందిస్తుండగా.. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 2న గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమవుతోంది.

భగవంత్ కేసరి నుండి సాంగ్ ప్రోమో రిలీజ్
నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి.ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అదరగొడుతుంది.సినిమా థియేట్రికల్ హక్కుల కోసం మంచి డిమాండ్ నెలకొంది.ఇక ఈసినిమా నుండి మొదటి సాంగ్ గణేష్ ఆంతేమ్ వచ్చే నెల 1న విడుదలకానుంది.అందులో భాగంగా ఈసాంగ్ ప్రోమోను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే చాలా కలర్ ఫుల్ గా వుంది.ఈపాటకు బాలయ్య,శ్రీ లీల కలిసి స్టెప్పులు వేయనున్నారు.శ్రీలీల ఇందులో బాలకృష్ణ కూతురిగా కనిపించనుంది.

నందమూరి బాలకృష్ణ నటజీవితానికి 49 ఏళ్ళు పూర్తి
నటసింహ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ పరిశ్రమలో 49 గ్లోరియస్ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. నటుడిగా నేటితో 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ తన పుట్టిన రోజైన జూన్ 10కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఆగస్టు 30ని కూడా అంతే గొప్పగా చూస్తారు. ఎందుకంటే..? 'తాతమ్మకల' అనే సినిమాతో బాలకృష్ణ తొలిసారిగా తన 14వ ఏట సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ బాలకృష్ణ దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా.. కథానాయకుడు, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, ఆదిత్య 369, భైరవద్వీపం, రౌడీ ఇనస్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్…

‘ఖుషి’లో సమంతను తీసుకోవడానికి అదే కారణం - శివ నిర్వాణ
టాలీవుడ్‌లోని సెన్సిబుల్ డైరెక్టర్లలో శివ నిర్వాణ ఒకరు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై ఆవిష్కరించడంలో ఆయనది అందె వేసిన చేయి. శివ నిర్వాణ ఇంతకుముందు తెరకెక్కించిన 'నిన్ను కోరి', 'మజిలీ', 'టక్ జగదీశ్' సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు…

అల్లు అర్జున్ తో ఇంస్టాగ్రామ్ టీం స్పెషల్ వీడియో
పుష్పలో నటనకు గాను జాతీయ అవార్డు గెలుచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు.తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు.ఇక ఇప్పుడు బన్నీకి తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది.సోషల్ మీడియా దిగ్గజం ఇంస్టాగ్రామ్ టీం నిన్న అల్లు అర్జున్ ను కలిసి ఆయనఫై స్పెషల్ వీడియో ను షూట్ చేసింది.

దుమ్ము రేపుతున్న షారూఖ్ ఖాన్ 'జవాన్' కొత్త సాంగ్
కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా నటించిన కొత్త చిత్రం 'జవాన్'. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ పై ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మంగళవారం కొత్త సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. 'నాట్ రామయ్యా వస్తావయ్యా' అనే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. కాగా రీసెంట్ గా #AskSRK సెషన్ లో షారూఖ్ ఖాన్ తన అభిమానులతో సినిమాకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా.. షారుఖ్, 'నాట్ రామయ్యా వస్తావయ్యా'…

గుంటూరు కారం షూటింగ్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం రీసెంట్ గా చిన్న చిన్న షెడ్యూల్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.ఈ గురువారం నుండి అన్నపూర్ణ స్టూడియో లో కొత్త షెడ్యూల్ స్టార్ కానుంది.ఈ షెడ్యూల్ లో మహేష్ జాయిన్ కానున్నాడు.ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.ఎలాగైనా నవంబర్ లోగా షూటింగ్ పూర్తి చేయాలనే పట్టుదలతో వుంది చిత్ర బృందం.ఇక ఈసినిమా నుండి త్వరలోనే సాంగ్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటివరకు రెండు పాటలు లాక్ చేశారట.అతి త్వరలో మొదటి పాటకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారని సమాచారం.

భగవంత్ కేసరి నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమో రానుంది
వీరసింహారెడ్డి తరువాత నందమూరి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమా ఫై అంచనాలు పెంచేసింది.ఇక ఇప్పుడు సాంగ్స్ ను రిలీజ్ చేసే పనిలో పడింది చిత్ర బృదం అందులో భాగంగా వచ్చే నెల 1న ఈసినిమా నుండి గణేష్ అంతేమ్ అనే సాంగ్ విడుదలకానుంది.ఈసాంగ్ లో బాలకృష్ణ,శ్రీ లీల వేసే స్టెప్పులు హైలైట్ కానున్నాయి అంతే కాదు ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అవుతుందని తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడని టాక్.

ధనుష్ సినిమాలో నాగార్జున
తమిళ హీరో ధనుష్,టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈసినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి.తాజాగా మేకర్స్ కూడా ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

బెంగళూరు బస్ డిపోలో రజినీకాంత్ సందడి, ఫోటోలు వైరల్
రజినీకాంత్.. గత కొన్ని దశాబ్దాలుగా తమిళ సినిమా రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న వ్యక్తి. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఆరాధిస్తున్న సూపర్ స్టార్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కేవలం తన కృషితో, పట్టుదలతో ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు. సీనియర్, జూనియర్ అన్న భేదం లేకుండా ఎంతోమంది నటీ,నటులు ఆయనతో కలిసి నటించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఏకంగా కార్పొరేట్ సంస్థలు సైతం తమ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తుంటాయి. అయితే అలాంటి రజినీకాంత్ నిజ జీవితంలో మాత్రం ఎక్కడా ఆ దర్పాన్ని ప్రదర్శించరు. ఒక సామాన్యుడిలా ప్రజలలో కలిసిపోతారు. తన సింప్లిసిటీ నేచర్ తో…

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటిస్తే తెలుగు జాతి గర్విస్తుంది - కె రాఘవేంద్ర రావు
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రగణ్యుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు దేశ అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు. ఎన్టీఆర్ శత జయంతి యేడాది సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం సోమవారం (ఆగస్టు 28, 2023) రూ.100 స్మారక నాణాన్ని విడుదల చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాఘవేంద్ర రావు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు చాలా ఆనందం కలిగించిందన్న ఆయన.. ఇదే విధంగా భారత ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న బిరుదును కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనికోసం అందరూ…

విశ్వక్ సేన్ యాంకర్‌గా ఆహాలో 'ఫ్యామిలీ ధమాకా' షో
తెలుగు ఆడియెన్స్‌కి తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించటంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'ఆహా' ఎప్పుడూ ముందుంటుంది. ఈ మాధ్యమం నుంచి మరో అద్భుతమైన రియాలిటీ షో ‘ఫ్యామిలీ ధమాకా’ త్వరలో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 8 నుంచి ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకోనుంది. ఈ షోను వీక్షించే ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని పెంచేలా ఎన్నో భావోద్వేగాలు, సవాళ్ల కలయికగా ఈ షో ఓ రోలర్ కోస్టర్‌లా మన ముందుకు రానుంది. అయితే ఇప్పటి వరకు మీరు చూసిన షోస్‌కు ఇదెంతో భిన్నమైనది. కుటుంబాల మధ్య అనుబంధాలను…

రూ. 600 కోట్ల క్లబ్‌లో రజనీకాంత్ 'జైలర్' మూవీ
సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజై 20 రోజులు అవుతున్నా థియేటర్లలో ఇంకా దీని హవా కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో చాలా కొత్త సినిమాలు రిలీజైనా.. జైలర్ ముందు అవన్నీ తేలిపోతున్నాయి. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ ర్యాంపేజ్ పాన్ ఇండియా లెవల్లో మరోసారి అందరికీ తెలియవచ్చింది. ముఖ్యంగా సౌత్‌లో రజినీ తన మ్యాజిక్ చూపిస్తున్నాడు. నిజానికి జైలర్ కథ కన్నా.. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఇక ఈ సినిమా ద్వారా రజినీ గత రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ…

కేరళ ప్రజలకు మోహన్ లాల్ ఓనమ్ శుభాకాంక్షలు
కేరళ రాష్ట్రం యొక్క అతిపెద్ద పండుగ 'ఓనమ్'. తెలుగువారికి 'పొంగల్' ఎంత పెద్ద పండుగో.. మలయాళీలకు ఈ ఓనమ్ అలాగ. మలయాళీ క్యాలెండర్‌లోని మొదటి నెలయిన చింగం మాసంలో ఓనమ్ పండుగా వస్తుంది. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓనమ్. ఈ పది రోజుల పండుగ 2023లో ఆగష్టు 20న ఆదివారం మొదలై.. గురువారం (ఆగష్టు 31)తో ముగియనుంది. ఇక ఓనమ్ పండుగ సందర్భంగా.. కేరళలో ఇళ్ల ఎదుట పుప్పాల అలంకరణలు, కొత్త వస్త్రాలు, విందు భోజనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటోంది. అయితే ఈ పండుగను కేరళ రాష్ట్రంలోనే కాకుండా.. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల ప్రజలు కుడా ఘనంగా జరుపుకోవడం…

నాగార్జున నా సామి రంగ గ్లింప్స్ రిలీజ్
కింగ్ నాగార్జున 99వ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈసినిమాకు నా సామి రంగ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈసినిమాతో డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.నాగ్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశార.ఇక ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఈ సినిమాలో నాగ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.