రీ రిలీజ్‌కు సిద్ధమైన బాలకృష్ణ ‘భైరవ ద్వీపం’

Nandamuri Balakrishna's Bhairava Dweepam Ready For Re-release on August 30

టాలీవుడ్‌లో రీసెంట్‌గా రీ రిలీజ్‌ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన అగ్ర హీరోల సినిమాలను మళ్ళీ విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ ‘భైరవ ద్వీపం’ సినిమా చేరింది. కాగా 1974లో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ.. సినీ పరిశ్రమలో 50 గ్లోరియస్ ఇయర్స్ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈ తరం ప్రేక్షకులను అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ‘భైరవ ద్వీపం’ సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. ‘భైరవద్వీపం’ చిత్రాన్ని దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన 4కె ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ (కెఎస్ రవీంద్ర), గోపీచంద్ మలినేని ఆదిత్య మ్యూజిక్‌లో రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ తరం ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని పంచబోతుందని ట్రైలర్ భరోసా ఇచ్చింది. ఇక 1994లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ ఎవర్‌గ్రీన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్.. క్లాప్ ఇన్ఫోటైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా రీ-రిలీజ్ అవుతోంది. ప్రేక్షకులకు మెమరబుల్ సినిమాటిక్ అనుభూతిని అందించి, బాక్సాఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించిన ఈ చిత్రం.. అప్‌గ్రేడ్ చేసిన 4కె క్వాలిటీతో ఆగస్ట్ 30, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్‌ అధినేతలు పివి గిరి రాజు, పి దేవ్ వర్మ ‘భైరవ ద్వీపం’ రీ రిలీజ్‌తో ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనున్నారు. బాలకృష్ణ ఒక తెగలో పెరుగుతున్న రాకుమారుడు విజయ్‌ గా ధైర్య సాహసాలు కలిగిన వీరుడిగా కనిపిస్తారు. విజయ్, కార్తికేయ రాజ్యానికి చెందిన యువరాణి ప్రేమలో పడతారు. ఒక దుష్ట మాంత్రికుడు, యువరాణిని బలి ఇవ్వడానికి ‘భైరవ ద్వీపం’ అనే ద్వీపానికి మాయాజాలం ద్వారా తీసుకువెళ్తాడు. విజయ్ చెడుతో పోరాడి, యువరాణిని ఎలా కాపాడతాడు అనేది.. గొప్ప మలుపులతో, అద్భుతమైన దృశ్యాలతో కూడిన విజువల్ వండర్ ‘భైరవ ద్వీపం’. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన యువరాణిగా నేటి ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా నటించడం విశేషం.

సీనియర్ నటుడు, రైటర్ రావి కొండల రావు రాసిన మ్యాజికల్ స్టోరీకి దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్వయంగా అద్భుతమైన స్క్రీన్‌ ప్లే ని అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కబీర్ లాల్, ఎడిటింగ్ డి.రాజ గోపాల్. చందమామ విజయ కంబైన్స్ బ్యానర్‌పై నిర్మాత బి. వెంకటరామి రెడ్డి నిర్మాణ విలువలు ప్రతి జనరేషన్ ని ఆకట్టుకునేలా అత్యున్నత స్థాయిలో వుంటాయి. భైరవ ద్వీపంలో కైకాల సత్యనారాయణ, విజయ్ కుమార్, రంభ, విజయ రంగరాజు, శుభలేఖ సుధాకర్, గిరి బాబు, బాబు మోహన్, మిక్కిలినేని, పద్మనాభం, సుత్తివేలు, కోవై సరళ, చిట్టి బాబు, కెఆర్ విజయ, మనోరమ, సంగీత, రజిత, కోవై సరళ తదితర నటీనటులు నటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.