ఆర్‌సీ16 కోసం కొత్త ఆఫీస్‌ ప్రారంభించిన మూవీ టీమ్

Director Buchi Babu Offers Special Pooja at New Office Building For RC16

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ ‘ఆర్‌సీ16’గా పరిగణిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు ‘ఆర్‌సీ16’కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోని బీఎన్‌ఆర్‌ హిల్స్‌లో ప్రత్యేకంగా ఒక కొత్త ఆఫీస్‌ని ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం (ఆగస్టు 28, 2023) ఉదయం చిత్ర యూనిట్ బుచ్చిబాబు కొత్త కార్యాలయానికి సంబంధించిన పూజా కార్యక్రమాలో పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఉదయం పూజా కార్యక్రమాలతో కొత్త ఆఫీస్‌ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తన గురువు, టాప్ డైరెక్టర్ సుకుమార్‌తో బుచ్చి బాబు కొబ్బరికాయ కొట్టించారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నిని, రవిశంకర్‌తో పాటు చిత్ర యూనిట్ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవలే బుచ్చి బాబు ఈ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడుతూ.. ‘నాలుగేళ్లుగా ఆర్‌సీ16 కథను రెడీ చేసేందుకు శ్రమించాను. ఇది నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్‌. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది. రామ్ చరణ్‌కి కూడా ఈ సబ్జెక్ట్ బాగా నచ్చింది. ఈ సినిమాలో చరణ్‌ బాడీ లాంగ్వేజ్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌ బస్టర్‌ హిట్టవుతుంది’ అని పేర్కొన్నారు. దీంతో ఆర్‌సీ16 సెట్స్‌కి కూడా వెళ్లకముందే అంచనాలు పెరుగుతున్నాయి.

కాగా ఇటీవలే ప్రకటించిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ మరియు బుచ్చి బాబు డైరెక్ట్ చేసిన ‘ఉప్పెన’ సినిమాలకు పురస్కారాలు లభించిన సంగతి తెలిసిందే. అలాగే రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఏకంగా 6 అవార్డులతో సత్తా చాటింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, బుచ్చిబాబు, సుకుమార్‌ క్రేజీ కాంబోలో సినిమా కావడంతో ఆర్‌సీ 16పై అంచనాలు భారీగా ఉన్నాయి. బుచ్చి బాబు ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్‌లో రాంచరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించనుండటం విశేషం. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌ వృద్ధి సినిమాస్‌ అధినేత వెంకట సతీష్ కిలారు, సుకుమార్‌ రైటింగ్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =