పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్ట్ మూవీస్ టైటిల్స్ ను వాడుకునే పనిలో వున్నారు టాలీవుడ్ యంగ్ హీరోస్.పవన్ కెరీర్ లో తొలిప్రేమ,తమ్ముడు,ఖుషి ఈ మూడు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఇందులో ఇప్పటికే వరుణ్ తేజ్ తొలిప్రేమ టైటిల్ తీసుకొని హిట్ కొట్టాడు.ఇక మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఖుషి తో వచ్చేందుకు సిద్దమవుతున్నాడు.శివ నిర్వాణ డైరెక్షన్ లో విజయ్,సమంత కలిసి నటించారు.ఈసినిమా వచ్చే నెల 1న విడుదలవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు నితిన్, తమ్ముడు అనే టైటిల్ ను వాడేస్తున్నాడు.నితిన్,వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది.ఈసినిమాకు తమ్ముడు అనే టైటిల్ ను ఖరారు చేశారు.నిన్ననే ఈసినిమా లాంచ్ అయ్యింది.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు.బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనుంది.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
A new chapter begins! 🎬
Dive into the vibrant highlights of the #Thammudu Pooja Ceremony
Stay tuned..Most exciting days are aheadhttps://t.co/XGJNoI1Njx#THAMMUDU 💥💥@actor_nithiin #SriramVenu @SVC_official pic.twitter.com/WvySCQOwoT
— Sri Venkateswara Creations (@SVC_official) August 27, 2023
అయితే కేవలం టైటిల్ ను తీసుకోవడమే కాదు హిట్ కూడా కొట్టి చూపించాడు వరుణ్ తేజ్.మరి విజయ్ దేవరకొండ,నితిన్ కూడా ఖుషి ,తమ్ముడుతో అదే రిజల్ట్ ను రిపీట్ చేస్తారో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: