
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 68


గుంటూరు కారం షూటింగ్ అప్డేట్

సెన్సార్ పూర్తి చేసుకున్న ఖుషి

ఏ మాయ చేశావే రోజులను గుర్తుచేసుకున్న సమంత


న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్న సమంత

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో VD 12

బాలకృష్ణ భగవంత్ కేసరి మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం
గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరొందిన టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'భగవంత్ కేసరి'. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్దిలు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ తో చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి. నందమూరి ఫ్యాన్స్ నుంచే కాకుండా ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా దీనిపై టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. అందులో ముఖ్యంగా బాలకృష్ణ తెలంగాణ యాసలో పలికిన డైలాగులు అభిమానులను బాగా అలరించాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా…

బోయపాటి, రామ్ పోతినేని స్కంద ప్రీ రిలీజ్ థండర్ డేట్ ఖరారు
టాలీవుడ్ లోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన తన సినిమాలలో హీరోలను ఊర మాస్ క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు. తాజాగా ఆయన ఉస్తాద్ రామ్ పోతినేనితో కలిసి 'స్కంద' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. తాజాగా సినిమాకు సంబంధించి మూవీ టీమ్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది. ‘స్కంద’ ప్రీ రిలీజ్ థండర్ ఆగస్టు 26న…

గాండీవధారి అర్జున బాధ్యతతో తీసిన సినిమా - వరుణ్ తేజ్
టాలీవుడ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ది ప్రత్యేక శైలి. కమర్షియల్ పంథాలో వైవిధ్యమైన కథాంశాలతో భిన్నమైన నేపథ్యాలు కలిగిన సినిమాలను ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత. ఇదే క్రమంలో తాజాగా వరుణ్ తేజ్ నటించిన మరో చిత్రం ‘గాండీవధారి అర్జున’. ‘చందమామ కథలు’, ‘గరుడవేగ’ వంటి విజయవంతమైన చిత్రాలు తీసిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్‌వీసీసీ పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ముమ్మురంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. 'గాండీవధారి అర్జున' సినిమా గురించి అనేక…

చంద్రయాన్ 3 సక్సెస్‌పై స్పందించిన టాలీవుడ్ సెలెబ్రిటీలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన 'చంద్రయాన్ 3' మిషన్ సూపర్ సక్సెస్ అయింది. తద్వారా రోదసిలో ఇప్పటివరకు మరే దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై 'ఇస్రో' విక్రమ్ ల్యాండర్‌ను దించింది. 17 నిమిషాల టెర్రర్ ప్రక్రియ అనంతరం విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి తొలి చంద్రుడి తొలి ఫోటోను పంపించింది. కాగా ఇప్పటివరకూ చంద్రునిపైకి అమెరికా, రష్యా, చైనా మాత్రమే రోవర్లను పంపాయి.

గుంటూరు కారం షూటింగ్ అప్డేట్
గుంటూరు కారం వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందని రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో మహేష్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లు గానే షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే హాలిడే కు ఫారెన్ కు వెళ్లి తిరిగి వచ్చిన మహేష్ షూటింగ్ తో బిజీ అయ్యాడు.కొన్ని రోజుల క్రితం గుంటూరు కారం కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాగా నిన్నటి తో ముగిసింది.ఈషెడ్యూల్ లో మహేష్ మూడు రోజులు పాల్గొన్నాడు.కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట.ఇక రేపటి నుండి సారథి స్టూడియోలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

రేపటి నుండి ఓటిటిలో స్లమ్ డాగ్ హస్బెండ్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'స్లమ్ డాగ్ హస్బెండ్'. ఇందులో ప్రణవి మానుకొండ హీరోయిన్ కాగా.. బ్రహ్మాజీ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించరు. అలాగే టాలీవుడ్ ప్రముఖ కమెడియన్స్ సునీల్, అలీ, సప్తగిరితో పాటు చంద్ర, యాదమరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పిరెడ్డి నిర్మాత కాగా, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఏఆర్ శ్రీధర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇక పూర్తి ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జులై నెలలో విడుదలై మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఈ…

షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి సెన్సార్ పూర్తి, యూ/ఏ సర్టిఫికెట్ జారీ
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా ‘జవాన్’. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ సరసన సౌత్ ఫిమేల్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ప్రియమణి, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మాత కాగా.. గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 7న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకు సంబంధించిన ప్రచార…

సెన్సార్ పూర్తి చేసుకున్న ఖుషి
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,ట్రైలర్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది.దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ అదరగొట్టింది.ప్రస్తుతం విజయ్ ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా విడుదలవుతుండడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీచేసింది.అయితే ఖుషికి రన్ టైం కొంచెం ఎక్కువగానే వుంది.దాదాపు 2గంటల 45నిమిషాల నిడివితో రానుంది.

వెన్నెల కిశోర్ హీరోగా యాక్షన్ కామెడీ సినిమా చారి 111
వినోదానికి కేరాఫ్ అడ్రస్ 'వెన్నెల' కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు.. వినోదంలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నారు. గత కొంతకాలంగా తెలుగు సినిమాలలో వెన్నెల కిశోర్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి లేదు. అయితే ఆయన హాస్య నటుడిగా మాత్రమే కాదు, కథానాయకుడిగానూ తనకు సూటయ్యే క్యారెక్టర్లు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్ కథానాయకుడిగా ఇప్పుడు ఒక సినిమా రాబోతోంది. వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'చారి 111'. ఆయన కథానాయకుడిగా బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్…

ఏ మాయ చేశావే రోజులను గుర్తుచేసుకున్న సమంత
టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు (సామ్) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ లో పాల్గొంది. అనంతరం అక్కడ హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో సమంత లోకల్‌గా ఉన్న పలు ఫేమస్ ప్లేసెస్‌ను విజిట్ చేస్తూ సందడి చేస్తోంది. అలాగే తన ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటోంది. కాగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పాపులర్ నటి అయిన సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తన యాక్టింగ్ కెరీర్‌కు విరామం ఇచ్చిన…

మెగాస్టార్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. త్వరలో శంకర్ దాదా MBBS రీ రిలీజ్
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోల పుట్టిన రోజు సందర్భంగా ఒకప్పటి హిట్ సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'పోకిరి' నుంచి మొదలైన ఈ ట్రెండ్.. ఆ తర్వాత ఇండస్ట్రీలోని ఇతర టాప్ హీరోల సినిమాల రీ రిలీజ్‌లతో ఊపందుకుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజై భారీ కలెక్షన్స్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే విచిత్రంగా గతంలో అంతగా విజయం సాధించని సినిమాలు కూడా రీ రిలీజ్‌లో నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'యోగి' సినిమాను రీసెంట్‌గా రీ రిలీజ్ చేయగా.. విడుదలైనప్పటికంటే ఇప్పుడే ఎక్కువ…

మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజినీకాంత్‌లపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటులలో యూత్‌లో మాంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఆయన సినిమాలు చూసి అభిమానులైన వారికంటే తన యాటిట్యూడ్ చూసి అభిమానులైనవారే ఎక్కువగా ఉంటారు. కార్యక్రమం ఏదైనా.. సందర్భం ఏదైనా.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించడానికి విజయ్ ఎప్పుడూ వెనుకాడరు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజినీకాంత్‌లను ఉద్దేశించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరూ సూపర్ స్టార్స్ అని, వాళ్ళకి జయం, అపజయం అనేవి చాలా సాధారణ పదాలని పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రెండింటికన్నా ఇంకా ఎక్కువని చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. సమంతతో కలిసి విజయ్ చేసిన కొత్త సినిమా 'ఖుషి'…

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నేడు కీలక ప్రకటన చేసింది. చిరంజీవితో కొత్త సినిమాను చేయనున్నట్లు ప్రకటించింది. తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి మరో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవిని చూడాలని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ అనౌన్స్ మెంట్ తో వారికి మెగా బర్త్ డే గిఫ్టును అందించినట్లయింది.

అన్నయ్య చిరంజీవికి 'బర్త్ డే' విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశంలోని అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. 1978లో 'పునాదిరాళ్లు' అనే తెలుగు సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన నేటికీ అగ్ర హీరోగా కొనసాగుతుండటం గమనార్హం. కాగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. నేటితో ఆయన 68వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కు పలువురు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి.. జనసేన పార్టీ అధినేత, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 'బర్త్ డే' విషెస్ తెలియజేశారు. ఈ మేరకు అన్నయ్య చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ ఒక లేఖను విడుదల…

గాంఢీవధారి అర్జున రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'గాంఢీవధారి అర్జున'. వరుణ్ తేజ్ తొలి సినిమా నుంచీ ఇతర హీరోలకు భిన్నంగా వినూత్న కథాంశాలను ఎంపిక చేసుకుంటూ జయాపజయాలతో నిమిత్తం లేకుండా కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా.. ఈరోజు సాయంత్రం రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దీనిని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నిర్వహించడం విశేషం.

న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్న సమంత
అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న 41వ 'ఇండియా డే పరేడ్'లో ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు పాల్గొన్నారు. కాగా భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వేడుకలు ఆదివారం మధ్యాహ్నం ఘనంగా జరిగాయి. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో నటి సమంతతో పాటు మరికొంతమంది భారతీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, బాలీవుడ్ నటి, మోడల్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సమంత న్యూయార్క్ వీధుల్లో నడుస్తూ ప్రేక్షకులకు చేతులు ఊపుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన భారతీయుల…

త్వరలో ఓటీటీలో రిలీజ్ కానున్న ‘బ్రో’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వినోదాయ సిత్తం’ చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌లో ఒక ముఖ్య పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించిన ప్రముఖ నటుడు సముద్రఖని ఈ ‘బ్రో’ చిత్రాన్ని రూపొందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో కలిసి నిర్మించారు. ఇక భీమ్లానాయక్ వంటి హిట్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించడం.. అలాగే 'విరూపాక్ష' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో ఈ…

త్రివిక్రమ్ క్లాప్‌తో ఘనంగా ప్రారంభమైన ఆశిష్ కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన ఆశిష్ వెలమకుచ హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ 'దిల్ రాజు ప్రొడక్షన్స్'లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది 'బలగం' వంటి అద్భుతమైన సినిమాను అందించిన హన్షిత రెడ్డి మరియు హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మూవీ టీమ్ సమక్షంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇవ్వగా ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ మూవీగా ఇది తెరకెక్కుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే కొల్లా…

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
జాతిరత్నాలుతో ఫేమ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈసినిమా తరువాత నవీన్ నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.ఇందులో అనుష్క హీరోయిన్.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.ఇక విడుదలకు రోజులు దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ఫై ద్రుష్టి పెట్టింది చిత్ర బృందం.అందులో భాగంగా ఈసినిమా ట్రైలర్ ను ఈనెల 21న విడుదల చేయనున్నారు.

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో VD 12
యంగ్ హీరో విజయ్ దేవరకొండ,జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఈసినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ఓ అండర్ కవర్ కాప్,గ్యాంగ్ స్టర్స్ ను ఎలా అంతమొందించాడు అనే పాయింట్ తో రానుందట.ఇందులో విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.కెరీర్ లో మొదటి సారి విజయ్ ఫుల్ టైం యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.