పార్లమెంటులో ప్రదర్శించబడిన తొలి చిత్రంగా గదర్ 2 సరికొత్త చరిత్ర

Sunny Deol's Gadar 2 Becomes The First Film to be Screened at New Parliament Building

బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన యాక్షన్ డ్రామా చిత్రం గదర్ 2 బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తోంది. ఆగస్ట్ 11న రిలీజై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ సినిమాలో సన్నీ డియోల్ సరసన అమీషా పటేల్ కథానాయికగా నటించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను కొత్త పార్లమెంట్ భవనంలో ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం (ఆగస్ట్ 25, 2023) నుంచి మూడు రోజుల పాటు ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సాగనుంది. దీనికోసం లోక్‌సభ సభ్యుల కోసం న్యూ ఢిల్లీలోని న్యూ పార్లమెంట్ హౌస్‌లో ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనను చిత్ర నిర్మాతలు ఏర్పాటుచేశారు. గదర్ 2 యొక్క మొదటి స్క్రీనింగ్ ఈరోజు ఉదయం 11:00 గంటలకు ప్రారంభమైంది. నేటినుంచి మూడు రోజుల పాటు కొనసాగనుండగా.. రోజుకి 5 షోలు వేయనున్నారు. కాగా లోక్‌సభ సభ్యుల కోసం ఒక చిత్రాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

22 ఏళ్ల కిందట గదర్ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ శర్మే ఈ సీక్వెల్ నూ తెరకెక్కించాడు. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ మరియు ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. 1971లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో.. పాకిస్థాన్ ఆర్మీ నుంచి తన కొడుకును రక్షించుకునేందుకు తారా సింగ్ చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. ఈ సినిమా 2001లో థియేటర్లలో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘గదర్ – ఏక్ ప్రేమ్ కహానీ’కి సీక్వెల్. ఈ చిత్రంలో సన్నీ డియోల్ తారా అనే ట్రక్ డ్రైవర్ పాత్రను పోషించగా, అమీషా పటేల్ సకీనాగా నటించింది. 1947లో భారతదేశ విభజన సమయంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. ఇదిలా ఉంటే, ఇక ఈ ఏడాది విడుదలై ఘనవిజయం సాధించిన షారుక్ ఖాన్ మూవీ ‘పఠాన్’ మరియు రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి 2’ దేశీయ బాక్సాఫీస్ కలెక్షన్లను గదర్ 2 బీట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కాగా పఠాన్ అత్యధిక దేశీయ వసూళ్లుగా రూ. 543.05 కోట్లు, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ కలెక్షన్ రూ. 510.99గా ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 19 =