మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్న దేవిశ్రీ ప్రసాద్

Devi Sri Prasad Takes Blessings From Music Maestro Ilayaraja

భారతీయ సినీ చరిత్రలో మ్యూజిక్ మ్యాస్ట్రోగా పేరొందిన లెజెండ్ ఇళయరాజాకు పాదాభివందనం చేశారు సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. ఈ మేరకు శనివారం ఇళయరాజా ఇంటికి వెళ్లిన ఆయన సంగీతంలో త‌న‌కు గురువైన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఆశీస్సులు తీసుకున్నాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈ పురస్కారాలు గెలుచుకున్న వారిలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో తాను అందించిన సంగీతానికి గానూ దేవిశ్రీ నేష‌న‌ల్ అవార్డు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈరోజు ఇళయరాజాను కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. అనంతరం ఈ విష‌యాన్ని దేవిశ్రీ ప్రసాద్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియజేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతుంది. ఇక ‘పుష్ప’ చిత్రంలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. కాగా డీఎస్పీగా ప్రాచుర్యం పొందిన దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో తెలుగు, తమిళం లోనే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలో కూడా సత్తా చాటారు. సంగీత దర్శకుడు దేవి. ముఖ్యంగా మెలోడీ పాటలకు మరియు ఐటమ్ సాంగ్స్ కు పెట్టింది పేరైన డీఎస్పీ మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. 1999లో విడుదలైన టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘దేవి’తో సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయయ్యేనాటికి దేవి వయస్సు కేవలం 16 సంవత్సరాలంటే ఆశ్చర్యం కలగక మానదు.

నాటినుంచి నేటి వరకు ఆయన ప్రయాణం అనితర సాధ్యం. ఈ క్రమంలో టాప్ హీరోలతో పాటు యువతరం హీరోలు నటించిన ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ అందించారు. ఇక తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దేవిశ్రీ ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. 2004లో వర్షం, 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, 2006లో బొమ్మరిల్లు సినిమాలకు 3 సార్లు ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకున్నారు. అలాగే 2013లో అత్తారింటికి దారేది సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారానికి ఎంపికయ్యారు. వీటితో పాటుగా పుష్ప, మహర్షి, రంగస్థలం, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర సినిమాలకు సైమా అవార్డులను అందుకున్నారు.

కాగా తాజా అవార్డులలో పుష్పతో పాటు మరికొన్ని అవార్డులు టాలీవుడ్ కు లభించాయి. వీటిలో ఉత్తమ జనరంజక చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జాతీయ అవార్డుతో పాటు మొత్తం 6 పురస్కారాలు గెలుచుకుంది. అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైంది. ‘కొండపొలం’ సినిమాకు సాహిత్యం అందించిన చంద్రబోస్ ఉత్తమ గేయ రచయితగా పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని కైవసం చేసుకున్నాడు. దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో అంబరాలు సంబరాన్నంటుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 6 =