‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనకు ఒక సవాల్ విసిరాడని, దానిని తాను అందుకోవాల్సి ఉందని పేర్కొన్నారు టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ. శనివారం ఆయన హైదరాబాద్‌లో జరిగిన ‘స్కంద-ది అటాకర్’ ప్రీరిలీజ్ థండర్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘స్కంద’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న బాలకృష్ణ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. అలాగే ఇటీవలి ‘చంద్రయాన్ 3’ విజయంపై ఓ ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసి ఇస్రో టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఇక కార్యక్రమంలో భాగంగా హీరో రామ్ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా వారిద్దరితో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బాలకృష్ణ, తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తం అయినందుకు హర్షం వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నందమూరి బాలకృష్ణ ఏమన్నారో అయన మాటల్లోనే.. ” ఈ సినిమాకు ‘స్కంద’ అని అర్ధవంతమైన టైటిల్ పెట్టినందుకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఈ రోజుల్లో సినిమా అంటే ఎలా ఉండాలి? ప్రేక్షకుల్ని ఎలా థియేటర్లకు రప్పించాలి? అనే అంశాలపై టాలీవుడ్ దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాలి. ఇక ‘దేవదాస్’ నుంచి రామ్ ప్రయాణాన్ని చూస్తున్నా. విభిన్న నేపథ్యమున్న కథలు, పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. తెలుగు కళామతల్లి మనకు ఇచ్చిన వరం రామ్. రామ్ ఇంతకుముందు తెలంగాణ నేపథ్యంలో ‘ఇస్మార్ట్ శంకర్’ చేసి నాకొక సవాల్ విసిరాడు. ఇప్పుడు నేను అదే నేపథ్యంలో ‘భగవంత్ కేసరి’ చేశాను. అయితే నేనింకా పాస్ అవ్వాల్సి ఉంది. ఇక ఈ జెనరేషన్ నటీమణులలో అందం, అభినయం, డాన్స్ ఇవన్నీ కలగలిసిన మంచి నటి శ్రీలీల” అని అన్నారు.
ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ.. “దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఇప్పటివరకు నేను ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు చేశాను. ఈ మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి. ఆయన ఏదైనా ఒక సినిమా ప్రారంభిస్తే.. పూర్తయ్యేవరకూ అంకితభావంతో శ్రమిస్తాడు. ఇప్పుడు రామ్ – బోయపాటి కలయికలో ‘స్కంద’ వస్తోంది. ఈ సినిమాలో పెద్ద నటులు భాగమయ్యారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు. కాగా అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్, ఇంద్రజ, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: