సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచి దూసుకెళ్తోన్న ఈ సినిమా స్పీడ్ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ‘జైలర్’ మూవీ రూ. 525 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ మేరకు తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ఈ సినిమా కేవలం 15 రోజుల్లో 525 కోట్ల గ్రాస్ మార్క్‌ని క్రాస్ చేయడం విశేషం. ఈ చిత్రం మొదటి వారాంతంలో రూ. 400 కోట్లు, రెండో వారంలో రూ. 120 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఇప్పటి వరకు తెలుగులో ఈ సినిమా రూ.45 కోట్లకు పైగా షేర్‌ను రూ.80 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్లు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో మరే ఏ డబ్బింగ్ సినిమాకు సాధ్యపడని విధంగా వరుసగా 12 రోజుల పాటు రూ. 1 కోటికి పైగా షేర్ సాధించి తెలుగు బాక్సాఫీస్ గత రికార్డులు తుడిచిపెట్టేసింది. ఇక తెలుగులో ఈ సినిమా విడుదల సమయంలోనే రిలీజైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఆశించిన రీతిలో విజయం సాధించకపోవడం కూడా ‘జైలర్’ మూవీకి కలిసి వచ్చిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఆగస్ట్ 10న విడుదలైన ఈ అల్ట్రా యాక్షన్ చిత్రం అతి తక్కువ రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన రెండో సినిమాగా నిలిచింది. దీనికిముందు 2018లో విడుదలైన రజినీకాంత్ చిత్రం ‘రోబో 2.0’ కేవలం ఎనిమిది రోజుల్లోనే రూ. 500 కోట్ల మైలురాయిని చేరుకుంది.
ఇక ‘తలైవా’ దాదాపు పుష్కర కాలం తర్వాత సాలిడ్ హిట్టు కొట్టడని రజినీ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ‘రోబో 2.0’ తర్వాత రజినీకాంత్ ఆ స్థాయి విజయం అందుకోవడం ఇదే ప్రథమం. విక్రమ్, పొన్నియన్ సెల్వన్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను కేవలం పదే పది రోజల్లోనే బీట్ చేసేశాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినాయకన్, రమ్య కృష్ణన్, వసంత్ రవి మరియు తమన్నా భాటియా కూడా కీలక పాత్రలు పోషించారు. కాగా ‘జైలర్’ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ మరియు బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ క్యామియో రోల్స్ లో కనిపించడం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: