నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకూ ఆయన ఎంట్రీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం చేయొచ్చనే టాక్ నడుస్తోంది. దీనికితోడు ఈ మధ్య మోక్షజ్ఞ తండ్రి సినిమాల షూటింగ్స్ మరియు సెట్స్‌ను తరచుగా సందర్శిస్తున్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. ఇక బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ షూటింగ్ జరిగే ప్లేస్ కి మోక్షజ్ఞ వెళ్లాడు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ బ్లాక్ షర్ట్, కళ్లకు గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపించాడు. ఈ క్రమంలో సెట్స్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీలతో కలిసి కొద్దిసేపు ముచ్చటించాడు. అలాగే ఆయన కొంత సమయం పాటు సినిమా షూటింగ్ ఆసక్తిగా తిలకించాడు. కాగా ‘భగవంత్ కేసరి’ షూటింగ్ సెట్స్‌లోని మోక్షజ్ఞ ఫోటోలు, ముఖ్యంగా శ్రీలీలతో మోక్షజ్ఞ మాట్లాడుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మోక్షజ్ఞ తొలి చిత్రంలో శ్రీలీల హీరోయిన్ అయితే బాగుటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ‘వీరసింహారెడ్డి’ సెట్స్‌లో మోక్షజ్ఞ సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
కాగా టాలీవుడ్‌లో రీసెంట్‌గా శ్రీలీల పేరు మారుమోగుతోంది. సీనియర్, జూనియర్ అన్న భేదం లేకుండా అందరి హీరోల సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల కనిపించబోతోందని ఒక వార్త.. లేదు, చెల్లిగా నటిస్తోందని మరో వార్త చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించబోతున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: