టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. జులై 28న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయిన ‘బ్రో’ సినిమా పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించింది. విడుదలైన తొలిరోజే రూ.30 కోట్ల షేర్‌ను కొల్లగొట్టడంతో పాటు తర్వాతి రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమాలో ‘టైమ్ ఆఫ్ గాడ్’ పాత్రలో పవన్ కల్యాణ్ చేసిన మ్యాజిక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. మనిషి జీవితంలో కాలం అనేది ఎంత విలువైనదో తెలియచెప్పే మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా ‘బ్రో’ రూపొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా సరే దాదాపు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుండటం తెలిసిందే. ఇదే క్రమంలో ‘బ్రో’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక థియేటర్లలో సూపర్ హిట్ అయిన ‘బ్రో’ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ‘బ్రో’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. గత అర్ధరాత్రి నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో మరోసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ ‘బ్రో’ని ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘బ్రో’ మూవీని రిలీజ్ చేశారు. మరెందుకు ఆలస్యం.. మీరూ ఓ సారి ‘బ్రో’ని చూసేయండి.👇
కాగా ఈ ‘బ్రో’ చిత్రం తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వినోదాయ సిత్తం’ చిత్రానికి రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌లో ముఖ్య పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించిన ప్రముఖ నటుడు సముద్రఖని ‘బ్రో’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఇక ‘భీమ్లానాయక్’ వంటి హిట్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించడం.. అలాగే ‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అందరి అంచనాలకు తగ్గట్లుగానే గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో స్టోరీ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, స్టైల్, మేనరిజమ్స్‌కు తోడు ఆయన గత చిత్రాల్లోని హిట్ సాంగ్స్‌తో రూపొందించిన ప్రత్యేక మెడ్లీ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయి ధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఇక వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. అలాగే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఓ సీన్‌లో కనిపించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. కాగా నిజ జీవితంలో వరుసకు మేనమామ, మేనల్లుడు అయిన పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తొలిసారి కలిసి ఈ సినిమాలో నటించడం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: