
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 64


తమిళ్ లో ఖుషి కొత్త రికార్డ్

సుధీర్ బాబు మామా మశ్చీంద్ర రిలీజ్ డేట్ ఫిక్స్

2024 సంక్రాంతి బరిలోకి అయలాన్?

రూల్స్ రంజన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో షూటింగ్ కంప్లీట్

డెవిల్ డబ్బింగ్ పనులు షురూ

సచిన్ చేతుల మీదుగా.. '800' మూవీ ట్రైలర్ విడుదల

స్కంద రిలీజ్ డేట్ మారింది

గామి డబ్బింగ్ తో బిజీగా విశ్వక్

రూల్స్ రంజన్ రిలీజ్ డేట్ ఫిక్స్

టిల్లు స్క్వేర్ విడుదల వాయిదా

ఓటిటిలో అలరిస్తున్న నారాయణ అండ్ కో
టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుధాకర్ కోమాకుల. ఆయన నటించిన లేటెస్ట్ ఫన్ ఎంటర్‌టైనర్ 'నారాయణ అండ్ కో'. చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జూన్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా 'నారాయణ అండ్ కో' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళ్ లో ఖుషి కొత్త రికార్డ్
శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సినిమా రిలీజ్ కు ముందు నుండే ఈక్రేజీ కాంబినేషన్ పై అందరికీ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈసినిమా పాటలు సినిమాపై హైప్ ను మరింత పెంచేశాయి. ఇక రిలీజ్ అయిన తరువాత కూడా వీరిద్దరి కెమిస్ట్రీకే మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక లవ్, కామెడీ, ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అందరినీ ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

రామబాణం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా రామబాణం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మే5వ తేదీన రిలీజ్ అయింది. ఈసినిమాలో గోపీచంద్ కు అన్న పాత్రలో జగపతిబాబు నటించగా.. అన్నదమ్ముల మధ్య ఎమోషన్ ఈసినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అయితే ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేయడానికి వచ్చేస్తుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 14వతేదీ నుండి ఈసినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈసినిమా…

ఓటిటిలోకి వచ్చిన రజినీకాంత్ జైలర్.. ఎక్కడంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆగష్టు 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ ర్యాంపేజ్ పాన్ ఇండియా లెవల్లో మరోసారి అందరికీ తెలియవచ్చింది. ఈ మధ్యకాలంలో చాలా కొత్త సినిమాలు రిలీజైనా.. జైలర్ ముందు అవన్నీ తేలిపోయాయి. నిజానికి జైలర్ కథ కన్నా.. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఇదే ఊపులో జైలర్ మూవీ రూ.600 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తద్వారా ఈ మార్క్ అందుకున్న రెండో తమిళ…

బిగ్ బాస్ 7- ఫేస్ ది బీస్ట్, కంటెస్టెంట్ ల కుస్తీలు
ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ బిగ్ బాస్ హోస్ లో మూడో రోజు మొదలైపోయింది. రెండు రోజులు నామినేషన్స్ తో వేడెక్కిన హోస్ మూడో రోజు కాస్త కూల్ గా మొదలైంది. కింగ్ విషయంలో ప్రిన్స్ కు అలానే షకీలాకు కాస్త మనస్పర్థలు రాగా ఇద్దరూ మాట్లాడుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. ఇక హౌస్ అంతా సైలెంట్ గా ఉన్న సమయంలో మొదటి వారం మొదటి టాస్క్ తో వచ్చేశాడు బిగ్ బాస్.

సుధీర్ బాబు మామా మశ్చీంద్ర రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తాను చేసే ప్రతి చిత్రంలో ఎదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తుంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఈ మూవీలో సుధీర్ బాబు మరో సరికొత్త ప్రయోగానికి తెరతీసాడు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉండే మూడు విభిన్న గెటప్స్‌లో ఆయన కనిపించనున్నాడు. ఓల్డ్ డాన్ పాత్రలో (పరశురాం), ఊబకాయం కలిగిన వ్యక్తిలా (దుర్గ) మరియు స్టైలిష్ డీజేగా సుధీర్ బాబు…

2024 సంక్రాంతి బరిలోకి అయలాన్?
తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా అయిపోయాడు.

రూల్స్ రంజన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుస సినిమాతో దూసుకుపోతున్నాడు. సినిమా హిట్లతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటూ వెళుతున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ నుండి రాబోతున్న సినిమా మీటర్. ఈసినిమాకు ఏఎంరత్నం తనయుడు రత్నం కృష్ణం దర్శకత్వం వహించాడు.

'జవాన్' పై మహేష్ ట్వీట్.. షారుఖ్ రియాక్షన్ ఇదే..!
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఈ యేడాది ఆరంభంలో 'పఠాన్' మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన 'జవాన్' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణే, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా రేపు హిందీ సహా అన్ని దక్షిణాది భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో జవాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి సినీ పండితులు సైతం…

ఆది కేశవ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఇక ఆతరువాత కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు చేశాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరో సాలిడ్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రుద్ర కాళేశ్వర్ రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు. మొదటిసారి ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు వైష్ణవ్ తేజ్.

సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో షూటింగ్ కంప్లీట్
జయపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుధీర్ బాబు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించగా ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 22న క్రిస్మస్ సెలవుల సందర్భంగా హరోం హర సినిమాను విడుదల చేయనున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ…

డెవిల్ డబ్బింగ్ పనులు షురూ
ప్రస్తుతం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తరువాత అమిగోస్ అంటూ వచ్చాడు. అయితే ఆసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు డెవిల్ అంటూ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా డెవిల్. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ఈసినిమాను నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

బిగ్ బాస్ 7- నామినేషన్స్ తో మొదలైన రచ్చ
ఫైనల్ గా బుల్లితెర ప్రేక్షకులు.. బిగ్ బాస్ లవర్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిపోయింది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో 14మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సీజన్ అలా మొదలైందోో లేదో మొదటిరోజు నుండే కొంతంమంది కంటెస్టెంట్ ల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇక ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టానికి తెరతీశాడు బిగ్ బాస్. నామినేషన్స్ ప్రక్రియను మొదలుపెట్టేశాడు. అయితే వచ్చిన ఒక్కరోజులోనే పెద్దగా కారణాలు కూడా ఉండవు కాబట్టి కొంతమంది కాస్త సిల్లీ రిజన్సే చెప్పుకొచ్చారు. ఆ రీజన్స్ తోనే అసలు వార్ మొదలైంది హౌస్ లో.

సచిన్ చేతుల మీదుగా.. '800' మూవీ ట్రైలర్ విడుదల
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ కాగా…

ఈ సినిమాకు తొలి ప్రేక్షకుడ్ని నేనే - మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. కాగా యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ నెల 7వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్‌ను ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అన్నారు.

స్కంద రిలీజ్ డేట్ మారింది
రామ్ పోతినేని,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న స్కంద సినిమా రిలీజ్ డేట్ మారింది.రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మొదటి పార్ట్ ఈనెల 28న విడుదలకావాల్సి ఉండగా వాయిదా పడింది దాంతో స్కంద ఆడేట్ ను వాడుకుంటుంది.నిజానికి అయితే స్కంద ఈనెల 15న విడుదలకావాల్సి ఉండగా సలార్ వాయిదాపడడంతో మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.ఈనెల 28న స్కంద విడుదలకానుందని కొద్దీ సేపటి క్రితం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

గామి డబ్బింగ్ తో బిజీగా విశ్వక్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ధమ్కీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఈసారి మాత్రం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంకా గామి సినిమాలను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. వాటిలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుందని అర్థమవుతుంది.

రూల్స్ రంజన్ రిలీజ్ డేట్ ఫిక్స్
జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే వారిలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈఏడాది ఆయన నటించిన వినరో భాగ్యము విష్ణు కథ,మీటర్ లు థియేటర్లలో సందడి చేశాయి.ఇక ఇప్పుడు మరో సినిమాతో రావడానికి రెడీ అవుతున్నాడు.అందులో భాగంగా కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.

టిల్లు స్క్వేర్ విడుదల వాయిదా
బ్లాక్ బాస్టర్ డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు.ఈసినిమాఫై మంచి అంచనాలు వున్నాయి.అయితే ఇంతకుముందు ఈసినిమాను సెప్టెంబర్ 15న విడుదలచేయాలని మేకర్స్ భావించారు.ఈ డేట్ ను అఫీషియల్ గా కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి విడుదలచేయలేకపోతున్నారు.దాంతో విడుదల వాయిదా పడింది.

కళ్యాణ్ రామ్, అభిషేక్ నామా మూవీ 'డెవిల్' కోసం 80 భారీ సెట్స్
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'డెవిల్'. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. స్వాతంత్య్రానికి పూర్వం ముందు కథాంశంతో రూపొందుతోన్న ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్స్ ను వేశారు. ఈ సెట్స్ చూస్తుంటే 'డెవిల్' సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'బింబిసార' సినిమాతో ఇప్పటికే ఒక పీరియాడికల్ మూవీలో నటించి మెప్పించిన నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చూపబోతున్నారు.