శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా రామబాణం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మే5వ తేదీన రిలీజ్ అయింది. ఈసినిమాలో గోపీచంద్ కు అన్న పాత్రలో జగపతిబాబు నటించగా.. అన్నదమ్ముల మధ్య ఎమోషన్ ఈసినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అయితే ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేయడానికి వచ్చేస్తుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 14వతేదీ నుండి ఈసినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈసినిమా అందుబాటులోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా.. ఖుష్బూ, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేదేఖర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం, వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫి అందించారు.
ఇదిలా ఉండగా మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు గోపీచంద్. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: