ఓటిటిలోకి వచ్చిన రజినీకాంత్ జైలర్.. ఎక్కడంటే?

Rajinikanth’s Jailer Movie Streaming in Amazon Prime Video

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆగష్టు 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్‌ ర్యాంపేజ్‌ పాన్‌ ఇండియా లెవల్లో మరోసారి అందరికీ తెలియవచ్చింది. ఈ మధ్యకాలంలో చాలా కొత్త సినిమాలు రిలీజైనా.. జైలర్‌ ముందు అవన్నీ తేలిపోయాయి. నిజానికి జైలర్‌ కథ కన్నా.. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీకాంత్ స్క్రీన్‌ ప్రజెన్స్‌, అనిరుధ్‌ మ్యూజిక్‌ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఇదే ఊపులో జైలర్ మూవీ రూ.600 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తద్వారా ఈ మార్క్‌ అందుకున్న రెండో తమిళ సినిమాగా నిలిచింది. దీనికన్నా ముందు రోబో 2.o రూ.600 కోట్ల మార్క్ అందుకుంది. అయితే ఇది కూడా రజినీ చిత్రమే కావడం విశేషం. దీంతో ఒకే హీరో నటించిన రెండు సినిమాలు రూ.600 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డ్ సృష్టించినట్లయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే థియేటర్లలో దుమ్ము రేపిన ఈ సినిమా ఎప్పుడు ఓటిటిలో వస్తుందా? ఏ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుందా? అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి నుంచి జైలర్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనిని నిర్ధారిస్తూ సదరు ఓటిటి సంస్థ సోషల్ మీడియా వేదికగా జైలర్ సినిమా స్ట్రీమింగ్ గురించి అప్డేట్ ఇచ్చింది. ఇక థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో జైలర్ ను చూసేయవచు. అలాగే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా మరోసారి ఈ మూవీని వీక్షించొచ్చు. అయితే ఇదిలా ఉండగా.. మరోవైపు జైలర్ నుంచి తమన్నా ట్రెండింగ్‌ సాంగ్‌ ‘నువ్వు కావాలయ్యా’ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఇది మరోసారి ట్రెండింగ్‌ లోకి వచ్చేసింది.

కాగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినాయకన్, రమ్య కృష్ణన్, వసంత్ రవి మరియు తమన్నా భాటియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక జైలర్‌ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ అగ్ర నటుడు మోహన్‌ లాల్ మరియు బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ క్యామియో రోల్స్ లో కనిపించడం విశేషం. సినిమాలో వీళ్ల ఎంట్రీకి ఆడియెన్స్‌ ఈలలు, గోలలతో థియేటర్‌లు దద్దరిల్లిపోయాయి. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే సంగీతం అందించాడు. కొన్నిచోట్ల కేవలం తన బీజీఎమ్ తో గూస్‌బంప్స్‌ తెప్పించాడు. మొత్తంగా జైలర్‌తో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనే సృష్టించాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని నెల్సన్‌ చెప్పడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.