కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 65

Vijay Deverakonda Visits Yadadri Temple Along With Family Members and Kushi Movie Team
సినిమా వార్తలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 'ఖుషి' మూవీ టీమ్

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ 'ఖుషి' మూవీ టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఈ ఉదయం దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రులు, సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండలతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. అలాగే 'ఖుషి' చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మరియు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు, పూజారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Srikanth Mవాట్సాప్
Jr NTR Can Play That Iconic Character, Says Gadar 2 Director Anil Sharma
సినిమా వార్తలు

ఆ పాత్ర పోషించాలంటే.. జూ.ఎన్టీఆర్‌కే సాధ్యం - బాలీవుడ్‌ డైరెక్టర్

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌పై బాలీవుడ్‌ దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్‌ సీనియర్ నటుడు సన్నీడియోల్‌ హీరోగా ఇటీవలే విడుదలైన ‘గదర్‌ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు అనిల్‌ శర్మ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేసాడు. ఈ సినిమాలోని తారాసింగ్‌ (కథానాయకుడు) పాత్రకు సన్నీడియోల్ కాకుండా.. ఏ ఆర్టిస్ట్‌ అయితే సరిగ్గా సరిపోతారనే ప్రశ్నకు డైరెక్టర్ అనిల్‌ శర్మ ఆసక్తికర సమాధానం చెప్పారు.

Srikanth Mవాట్సాప్
sensational advance bookings for jawan movie
సినిమా వార్తలు

జవాన్ కు సెన్సేషనల్ బుకింగ్స్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్,కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జవాన్.మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో జవాన్ అదరగొడుతుంది.హిందీ తోపాటు తెలుగు ,తమిళ భాషల్లో విడుదలవుతున్నా బుకింగ్స్ విషయంలో మాత్రం హిందీ వెర్షన్ సెన్సేషన్ క్రీయేట్ చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Bigg Boss Telugu 7 Started, Know The Show Timings and Contestants List Here
బిగ్ బాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం.. కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?

తెలుగునాట 'బిగ్ బాస్' రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర వీక్షకుల్లో ఈ షోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకూ ఈ షో తెలుగులో 6 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా మొదలైన ఈ కార్యక్రమంలో హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లను హౌస్‌లోకి ఆహ్వానించారు. నాగ్ గత కొన్ని రోజులుగా 'ఉల్టా పుల్టా' అంటూ ఈ సీజన్ ప్రోమోతోనే ఆసక్తి పెంచిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
kushi 4days collections
బాక్సాఫీస్

బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న ఖుషి

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి బాక్సాఫీస్ ను కుమ్మేస్తుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుండడం తో మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 70.23కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.గీత గోవిందం తరువాత 100కోట్ల క్లబ్ లో చేరడం విజయ్ కు ఇది రెండో సారి కానుంది.

Mahender Reddyవాట్సాప్
salaar release postponed
సినిమా వార్తలు

సలార్ రిలీజ్ వాయిదా.. అప్పుడే రానుంది

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ విడుదల వాయిదా పడింది.ఈసినిమా రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.అందులో భాగంగా మొదటి భాగం సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న విడుదలకావాల్సి వుంది అయితే విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో విడుదలతేదిని వాయిదా వేశారు మేకర్స్.ఈ వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేశాయి.

Mahender Reddyవాట్సాప్
new poster released from ubs movie
ఫస్ట్ లుక్

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవన్ పోస్టర్ రిలీజ్

పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.గబ్బర్ సింగ్ తరువాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భగత్ సింగ్ ఫై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటివరకు 20శాతం షూటింగ్ జరుపుకోగా త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ లో పవన్ మాస్ గా కనిపించాడు.

Mahender Reddyవాట్సాప్
hi nanna new schedule started
షూటింగ్ అప్‌డేట్

హాయ్ నాన్న షూటింగ్ అప్డేట్

ఈసమ్మర్ లో దసరాతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు న్యాచురల్ స్టార్ నాని.రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.నాని కెరీర్ లో ఇదే మొదటి 100కోట్ల సినిమా.ఇక ఈసినిమా తరువాత నాని నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.కేవలం గ్లింప్స్ తోటే సినిమాకు హైప్ తెప్పించింది చిత్ర బృందం.ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాఫై అంచనాలను పెంచేసింది.ఇక ఈరోజు నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. కూనూర్ లో ఈ షెడ్యూల్ జరుగుతుంది.

Mahender Reddyవాట్సాప్
Jr NTR and Kalyanram Shares Emotional Post on Their Father Nandamuri Harikrishna
సినిమా వార్తలు

తండ్రి హరికృష్ణను తలచుకుంటూ.. జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఎమోషనల్ ట్వీట్స్

టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌ మరియు ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్‌ తమ తండ్రి నందమూరి హరికృష్ణని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు హరికృష్ణ జయంతి సందర్భంగా తనయులు ఇరువురూ సోషల్ మీడియా వేదికగా తమ తండ్రిని స్మరించుకుంటూ ఎమోషనల్ ట్వీట్స్ పంచుకున్నారు. కాగా నటుడు, పొలిటీషియన్ అయిన నందమూరి హరికృష్ణ 2018, ఆగస్ట్‌ 29న రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తమ ఫ్యామిలీకి చెందిన ఓ అభిమాని పెళ్లికి హాజరవడం కోసం ఆయన నెల్లూరు జిల్లా కావలికి కారులో బయలుదేరగా.. మధ్యలో నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తీవ్ర గాయాలపాలై మరణించారు. అయితే అదే కారులో…

Srikanth Mవాట్సాప్
jailer gets ott release date
ఓటీటీ

జైలర్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ గత నెల 10న విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 600కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేయడమే కాదు రజినీ స్టామినా ఏంటో చూపెట్టి ట్రాక్ లోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటి లోకి రానుంది.ఈనెల 7నుండి అమెజాన్ ప్రైమ్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది. అయితే జైలర్ ఇప్పటికీ తమిళనాడు లో మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Extends Birthday Wishes To Power Star Pawan Kalyan
సినిమా వార్తలు

తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అన్నయ్య చిరంజీవి బర్త్ డే విషెస్

టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. నేటితో ఆయన 51 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52వ పడిలోకి అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ బర్త్‌ డే సందర్భంగా.. ఆయనకు అభిమానులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా పవన్‌తో కలిసి తాము దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. అలాగే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా త‌న‌ తమ్ముడు జన్మదినం సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి పవన్‌కు స్పెషల్‌ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
kushi day 1 collections
బాక్సాఫీస్

మొదటి రోజు సత్తా చాటిన ఖుషి

విజయ్ దేవరకొండ, సమంత ల ఖుషి నిన్న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తో పాటు సూపర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 30.1 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో 10కోట్ల షేర్ ను రాబట్టింది.ఈరోజు,రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వున్నాయి. దాంతో ఈ వారాంతంలో ఖుషి 50కోట్ల క్లబ్ లోకి చేరుకోనుంది. అయితే ఈసినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది.ఆ మార్క్ ను చేరుకువాలంటే ఓవరాల్ గా 50కోట్ల షేర్ ను రాబట్టాల్సివుంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఫుల్ రన్ లో ఈ టార్గెట్ ను చేరుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

Mahender Reddyవాట్సాప్
Pawan Kalyan To Kick-start New Movie with Surender Reddy
సినిమా వార్తలు

పవన్‌ కళ్యాణ్, సురేందర్‌ రెడ్డి కలయికలో కొత్త సినిమా

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. ఈ పేరు వినిపిస్తే అభిమానులకు పూనకాలే. సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా ఆయనను పిచ్చిగా అభిమానిస్తుంటారు మెగా ఫ్యాన్స్. అయితే గత కొంతకాలంగా ఆయన రాజకీయాలలో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ పవన తన అభిమానులకు వినోదం పంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి అభిమానులు మరిన్ని ఎక్కువ సినిమాలు రావాలని కోరుకున్నారు. దీంతో పవన్‌ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూనే.. మరోవైపు వరుసగా సినిమాలు చేసుకుంటూ జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ఆయన కథానాయకుడిగా.. ఇప్పటికే 'హరిహరవీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' వంటి సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu New Poster Released on Pawan Kalyan's Birthday
ఫస్ట్ లుక్

పవర్ స్టార్ బర్త్‌ డే వేళ.. హరి హర వీరమల్లు కొత్త పోస్టర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతూ అనేక పోస్టులు పెడుతున్నారు. ఇక మరోవైపు పవన్ కొత్త చిత్రాల నిర్మాతలు కూడా ఆయా సినిమాలకు సంబంధించి కీలక అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్దరాత్రి 12:17కి పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాలోని న్యూలుక్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కి స్పెషల్ గిఫ్ట్ అందించింది చిత్ర యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ ఒక పోస్ట్ చేసింది. అందులో.. ఇక 'ఈ సంతోషకరమైన రోజున మన హరి హర వీరమల్లు యొక్క అసాధారణమైన ధైర్యసాహసాలు…

Srikanth Mవాట్సాప్
og teaser out now
ట్రైలర్ & టీజర్

ఓజీ గ్లింప్స్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ గ్లింప్స్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఈరోజు పవన్ బర్త్ డే సందర్భంగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.100 సెకండ్ల రన్ టైంతో వచ్చిన ఈ గ్లింప్స్ హైప్ కు ఏమాత్రం తగ్గకుండా వుంది.గ్లింప్స్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ గా పవన్ రూత్ లెస్ గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.గ్లింప్స్ లో పవన్ లుక్,తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యింది.పవన్ ను ఇంతకుముందు ఎప్పుడూ చూపించని విధంగా చూపిస్తున్నాడు డైరెక్టర్ సుజీత్.

Mahender Reddyవాట్సాప్
Anushka Shetty Set To Debut in Mollywood with Kathanar Movie
సినిమా వార్తలు

అనుష్క కొత్త సినిమా.. ఏకంగా 14 భాషల్లో

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి త్వరలోనే ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇది ఏకంగా 14 భాషల్లో రిలీజ్ కానుండటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. 'కథానార్ - ది వైల్డ్ సోర్సెరర్' అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమా ప్రధానంగా హారర్ నేపథ్యంలో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు. కాగా ఇది మలయాళ సినిమా కావడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే..? మలయాళంలో అనుష్కకు ఇదే తొలి సినిమా. 18 ఏళ్ల తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆమె ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. ఇప్పుడు మొదటిసారిగా మాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.

Srikanth Mవాట్సాప్
Nayanthara Makes Her Instagram Debut with Fastest One Million Followers
సినిమా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీతోనే రికార్డ్ క్రియేట్ చేసిన నయనతార

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటీమణుల్లో నయనతార ఒకరు. లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆమె, పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌లో నటించడం ద్వారా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం నయనతార, షారుఖ్‌ఖాన్‌-అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'జవాన్‌' సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న జవాన్‌ చిత్రంలో న‌య‌న‌తార ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా కనిపించనుంది. నయనతార సాధారణంగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలలో కానీ, సోషల్‌ మీడియాలో కానీ కనిపించదు. ఇక ఏదైనా విషయం అభిమానులతో పంచుకోవాలంటే తన భర్త, ఫిల్మ్ మేకర్ విఘ్నేష్ శివన్ ఖాతాని…

Srikanth Mవాట్సాప్
Jawan To Salaar, The Most Awaited Movies Releasing in This September
సినిమా వార్తలు

సెప్టెంబరులో రిలీజ్ అవుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీస్

సినీ ప్రియులకు శుభవార్త. చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు కలిగిన అనేక చిత్రాలు సెప్టెంబరులో విడుదల కానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. వీటిలో స్టార్ హీరో, హీరోయిన్లు నటించిన పలు సినిమాలు సహా మరికొన్ని క్రేజీ చిత్రాలు ఉన్నాయి. జవాన్ నుండి సలార్ వరకు చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలు ఏమిటో ఇక్కడ చూద్దాం..

Srikanth Mవాట్సాప్
Ghannu Bhai First Look Out
ఫస్ట్ లుక్

ఘన్నుభాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ హీరో ఆదిత్య గంగసాని టైటిల్ రోల్ లో నటిస్తున్న సినిమా ఘన్ను భాయ్ ..ఇస్మార్ట్ కా బాప్ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రణయ్ మ్యాకల్ డైరెక్ట్ చేస్తుండగా అభి సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసినిమా నుండి ఈరోజు హీరో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.పోస్టర్ చూస్తుంటే ఘన్ను భాయ్ యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని తెలుస్తుంది. అయితే హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు.

Mahender Reddyవాట్సాప్
miss shetty mr shetty censor formalities complete
సినిమా వార్తలు

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సెన్సార్ కంప్లీట్

జాతిరత్నాలు తరువాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇందులో అనుష్క హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం ఈసినిమా టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీ గా వున్నారు.అనుష్క మాత్రం ప్రమోషన్స్ కు దూరంగా వుంది. ఇక ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.2:31 గంటల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొను సినిమా ఫై అంచనాలను పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్

షేర్