ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఇక ఆతరువాత కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు చేశాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరో సాలిడ్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రుద్ర కాళేశ్వర్ రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు. మొదటిసారి ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు వైష్ణవ్ తేజ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకునే పనిలో ఉంది. నిజానికి ఈసినిమాను ఆగష్ట్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఇంకా పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ కాస్త వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. నవంబర్ 10వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. సిత్రాల సిత్రవతి అంటూ వచ్చే మొదటి పాటను రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈపాట ప్రోమో ను రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. అపర్ణా దాస్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రకాశన్, మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అపర్ణా దాస్. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: