రామ్ పోతినేని,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న స్కంద సినిమా రిలీజ్ డేట్ మారింది.రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మొదటి పార్ట్ ఈనెల 28న విడుదలకావాల్సి ఉండగా వాయిదా పడింది దాంతో స్కంద ఆడేట్ ను వాడుకుంటుంది.నిజానికి అయితే స్కంద ఈనెల 15న విడుదలకావాల్సి ఉండగా సలార్ వాయిదాపడడంతో మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.ఈనెల 28న స్కంద విడుదలకానుందని కొద్దీ సేపటి క్రితం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అదే రోజున ఈసినిమా తో పాటు కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ అలాగే సితార ఎంటెర్టైనెర్మెంట్స్ నిర్మిస్తున్న మ్యాడ్ కూడా విడుదలకానున్నాయి.మరి ఈ రెండు సినిమాలు స్కందకు ఎలాంటి పోటీనిస్తాయో చూడాలి.
ఇక ఇటీవల విడుదలైన స్కంద ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుని అంచనాలను భారీగా పెంచేసింది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ ,జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈసినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: